|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుహాస్ మూవీ షూటింగ్ లో ప్రమాదం, పడవ బోల్తా.. కోటి రూపాయలు సముద్రం పాలు, ప్రాణాలు ఎలా కాపాడుకున్నారో తెలుసా

Published: 05-10-2025, 3:50 AM
సుహాస్ మూవీ షూటింగ్ లో ప్రమాదం, పడవ బోల్తా.. కోటి రూపాయలు సముద్రం పాలు, ప్రాణాలు ఎలా కాపాడుకున్నారో తెలుసా

నటుడు సుహాస్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన తమిళంలో నటిస్తున్న ‘మండాడి’ చిత్ర షూటింగ్ లో ఊహించని ప్రమాదం జరిగింది. సముద్రంలో పడవ బోల్తా పడటంతో కోటి రూపాయల విలువైన కెమెరా, ఇతర సామాగ్రి సముద్రం పాలయ్యాయి. సిబ్బంది ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

Key Points

1

నటుడు సుహాస్ తమిళంలో నటిస్తున్న 'మండాడి' చిత్ర షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.

2

తమిళనాడులోని తొండి సముద్ర తీరంలో చిత్రీకరణ సమయంలో పడవ బోల్తా పడింది.

4

పడవలో ఉన్న చిత్ర సిబ్బందిని పక్కనే మరో పడవ సిబ్బంది రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది.

సుహాస్ కెరీర్ గ్రాఫ్: హీరోగా ఎదుగుదల

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్. తక్కువ సమయంలో సుహాస్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. సుహాస్ కామెడీ టైమింగ్ బావుంటుంది. కానీ హీరోగా అవకాశాలు రావడంతో ప్రస్తుతం సుహాస్ కామెడీ పాత్రలు బాగా తగ్గించారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలతో సుహాస్ వరుస విజయాలు అందుకుంటున్నాడు.

హిట్ 2 మూవీలో సుహాస్ విలన్ గా నటించి మెప్పించాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశాడు. ప్రస్తుతం సుహాస్ తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్ర టైటిల్ మండాడి. ఈ మూవీలో సుహాస్ తోపాటు సూరి కూడా నటిస్తునారు. మాతి మారన్ ఈ చిత్రానికి దర్శకుడు. మండాడి మూవీ విషయంలో చిత్ర యూనిట్ వైవిధ్యమైన అప్రోచ్ ఫాలో అవుతోంది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. రెండు భాషల వెర్షన్స్ షూటింగ్ ఒకేసారి జరుగుతోంది. తమిళంలోసూరి హీరో కాగా సుహాస్ విలన్.. తెలుగు వెర్షన్ లో సుహాస్ హీరోగా సూరి విలన్ గా నటిస్తున్నారు.

‘మండాడి’ షూటింగ్ లో ఊహించని ప్రమాదం

తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని తొండి సముద్ర తీర ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. సముద్రంలో చిత్రీకరించే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉన్నాయి. దీనితో చిత్ర సిబ్బంది 60 లక్షల విలువైన రెడ్ డిజిటల్ కెమెరా, ఇతర సామాగ్రిని సముద్రంలోకి పడవలో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.

ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో 60 లక్షల విలువైన కెమెరా సముద్రంలో మునిగిపోయింది. మరికొంత సామాగ్రి కూడా మునిగిపోయింది. మొత్తం కోటి రూపాయల విలువైన సామాగ్రి సముద్రం పాలు అయినట్లు తెలుస్తోంది. అయితే పడవలో ఉన్న సిబ్బందిని పక్కనే మరో పడవలో ఉన్న సిబ్బంది రక్షించారు. దీనితో ప్రాణాపాయం తప్పింది.

కోటి నష్టం, సిబ్బంది ప్రాణాపాయం నుండి రక్షణ

పడవ సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుహాస్ కి ఇది తమిళ డెబ్యూ మూవీ. సుహాస్, సూరితో పాటు ఈ చిత్రంలో సత్యరాజ్, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మండాడి చిత్ర షూటింగ్ లో జరిగిన ఈ ప్రమాదం యూనిట్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది. అయితే చిత్ర సిబ్బంది ప్రాణాలు సురక్షితంగా ఉండటం ఊరటనిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.