|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suhas: సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published: 17-06-2025, 8:32 AM
Suhas: సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ నటుడు సుహాస్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ఖరారు చేశారు. మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

సుహాస్ మరియు మాళవిక మనోజ్ నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ జూలై 11న విడుదలవుతోంది.

2

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

4

వీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేస్తోంది.

ఓ భామ అయ్యో రామ విడుదల తేదీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సుహాస్ (Suhas).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) ఒకటి. రొమాంటిక్‌ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. దీనికి రామ్ గోధల దర్శకత్వం వహిస్తుండగా.. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు.

హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా.. ఈ సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే జోష్‌లో సినిమా రిలీజ్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ‘ప్రేమ సినిమా లాంటిది.. సినిమా ప్రేమ లాంటిది. ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న థియేటర్లలో విడుదలవుతోంది’ అని చెప్పుకొస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సుహాస్ అండ్ మాళవిక సినిమా రీల్‌ను పట్టుకుని ఉన్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

చిత్ర వివరాలు మరియు నటీనటులు

అంచనాలు మరియు ప్రచారం

చిత్ర యూనిట్ జూలై 11వ తేదీని విడుదల తేదీగా ప్రకటించడంతో, ప్రేక్షకులు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ఎదురుచూస్తున్నారు. టీజర్ మరియు పాటలకు లభించిన స్పందన చిత్రంపై అంచనాలను పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.