
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిర్మాతలు, పవన్ కళ్యాణ్, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూనే, తనపై వస్తున్న పుకార్లకు పరోక్షంగా సుజీత్ సమాధానం ఇచ్చారు. ఈ పోస్ట్ ఓజీ ఓటీటీ విడుదలకు ముందు ప్రాధాన్యత సంతరించుకుంది.
Key Points
ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల; అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.
దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ పోస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్, అభిమానులు, నిర్మాత దానయ్యకు సుజీత్ ప్రేమ, కృతజ్ఞతలు తెలిపారు.
సుజీత్-దానయ్యల మధ్య విభేదాల పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టడానికే ఈ లేఖ.
ఓజీ ఓటీటీ రిలీజ్, సుజీత్ లేఖ
Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సాహో ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 23) నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓజీ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే.. చిత్ర దర్శకుడు సుజీత్ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇందులో ఇలా రాసి ఉంది. ‘ఓజీ గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అయితే.. చిత్ర ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఏమి అవసరం అనేది కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. ఈ చిత్రం కోసం నా నిర్మాత, టీమ్ ఇచ్చిన మద్ధతు గురించి మాటల్లో చెప్పలేను. ఈ చిత్రం పట్ల పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులు చూపించిన అమితమైన ప్రేమ వర్ణించలేనిది. ఇక నిర్మాత దానయ్య నాకు ఇచ్చిన సపోర్టు, నమ్మకానికి ఆయనకు కృతజ్ఞతలు. ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో సుజీత్.’ అని రాసి ఉంది.
దర్శకుడు సుజీత్ లేఖలో ఏముంది?
Thamma Review : ‘థామా’ మూవీ రివ్యూ.. రష్మిక మందన్న ఫస్ట్ హారర్ సినిమా ఎలా ఉంది..?
సుజీత్-దానయ్య మధ్య మనస్పర్థల పుకార్లు
ప్రస్తుతం సుజీత్ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుజీత్ ఇలా ఎందుకు లేఖ రాశాడు అనే విషయం పై నెట్టింట చర్చ మొదలైంది. అయితే.. ఈ చిత్ర నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్ కు మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఈ క్రమంలోనే సుజీత్ కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదనే రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే సుజీత్ ఇలా చేశాడని కొందరు అంటున్నారు.
మొత్తంగా, సుజీత్ తన లేఖ ద్వారా ఓజీ చిత్రం పట్ల తన నిబద్ధతను, సహకరించిన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. నిర్మాతలు, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాల పుకార్లకు తెరదించుతూ, ఈ పోస్ట్ అభిమానులలో చర్చకు దారితీసింది.


