
Sukku- Siddu: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ హీరో. కానీ, ఆ తరువాత వచ్చిన జాక్, తెలుసు కదా లాంటి సినిమాలతో ప్లాప్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా మూడు ప్రాజెక్టులు చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్ టాప్ మేకర్స్‌తో జత కట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukku- Siddu)కి చెందిన సుకుమార్ రైటింగ్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో ఒక కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్వయంగా సుకుమార్ కథ అందిస్తుండటం విశేషం. అయాన ప్రియా శిష్యుడు సూర్యప్రతాప్ పలనాటి ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది.
ఇక సిద్ధూ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయేలా ఈ కథను సుకుమార్ సెట్ చేశాడని, ఆగస్టు లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అందుకే, ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి తన గత రెండు సినిమాలతో ఆడియన్స్ ను డిజపాయింట్ చేసిన సిద్దు రానున్న సినిమాలతో ఎలాంటి ప్రభావం చూపిస్తాడు అనేది చూడాలి.


