
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ శిష్య పరంపర కొనసాగుతోంది. పుష్ప సినిమాలకు పనిచేసిన వీరా కోగటం దర్శకుడిగా పరిచయం కానున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ఓ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించనున్నారు. సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి.
Key Points
సుకుమార్ శిష్యుడైన వీరా కోగటం దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
పుష్ప, పుష్ప 2 సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా వీరా పనిచేశారు.
కిరణ్ అబ్బవరంతో వీరా క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించనున్నాడు.
సుకుమార్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, కిరణ్ అబ్బవరం కూడా ఒప్పుకున్నాడు.
సుకుమార్ శిష్యుల విజయ ప్రస్థానం
ఓ వైపు రంగస్థలం, పుష్ప లాంటి భారీ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేయడంతో పాటు మరోవైపు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ సాగిపోతున్నారు టాప్ డైరెక్టర్ సుకుమార్. భారీ సినిమాలు చేస్తూనే తన శిష్యులను ప్రోత్సహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో ఎంతో మంది యంగ్ అండ్ టాలెంటెడ్ అప్ కమింగ్ డైరెక్టర్లను సానబెడుతున్నారు. ఆయన శిష్యుల్లో చాలా మంది ఇప్పటికే డైరెక్టెర్లుగా మారారు. ఇప్పుడు అదే వరుసలో మరో శిష్యుడు డైరెక్టర్ కాబోతున్నాడు.
టాలీవుడ్ లో డైరెక్టర్లుగా మారిన సుకుమార్ శిష్యులకు ఓ స్పెషాలిటీ ఉంది. సుకుమార్ దగ్గర పని నేర్చుకున్న వాళ్ల మెగా ఫోన్ పట్టి హిట్లు కొడుతున్నారు. నాని తో దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల , వైష్ణవ్ తేజ్ తో ఉప్పెనతో సంచలన నమోదు చేసిన బుచ్చిబాబు సానా, కుమారి 21 ఎఫ్ అంటూ ట్రెండ్ సెట్ చేసిన సూర్యప్రతాప్ పల్నాటి.. ఇలా చెప్పుకుంటూ పోతే డైరెక్టర్లుగా అదరగొడుతున్న సుకుమార్ శిష్యులు ఎంతో మంది ఉన్నారు.
వీరా కోగటం దర్శకత్వ ప్రవేశం
ఇప్పుడు సుకుమార్ దగ్గర పనిచేసిన మరో శిష్యుడు కూడా డైరెక్టర్ గా మారబోతున్నాడు. అతనే వీరా కోగటం. పుష్ప, పుష్ఫ 2 సినిమాలకు రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కీ రోల్ ప్లే చేశాడు వీరా. తన పనితో మెప్పించాడు. ఇప్పుడు డైైరెక్టర్ గా మారబోతున్నాడు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తో సినిమా చేయబోతున్నాడు వీరా.
కిరణ్ అబ్బవరంతో వీరా కోగటం ఓ క్రైమ్ థ్రిల్లర్ తీయబోతున్నాడు. ఈ కథ ముందుగా సుకుమార్ కు వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హీరో కిరణ్ ను కలిసి కథ చెప్పాడు వీరా. కథ బాగా నచ్చడం, సుకుమార్ కూడా ఓకే అనడంతో కిరణ్ అబ్బవరం కూడా సినిమాకు ఒప్పుకొన్నాడు. ఈ మూవీని సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డితో కలిసి వంశీ నందిపాటి ప్రొడ్యూస్ చేయనున్నాడు.
కిరణ్ అబ్బవరం క్రైమ్ థ్రిల్లర్
గతేడాది ‘క’ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత దిల్ రూబా అంటూ లవ్ స్టోరీ చేసినా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ‘కే రాంప్’ అంటూ థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మరోవైపు ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక వచ్చే ఏడాది ప్రారంభంలో వీరా కోగటం సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
సుకుమార్ శిష్యుడు వీరా కోగటం, కిరణ్ అబ్బవరంతో తీయబోయే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఆమోదంతో వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.


