|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కారులో బోరున ఏడ్చిన సుమ కనకాల! కారణం తెలిస్తే షాక్ అవుతారు!

Published: 13-04-2026, 6:05 AM
షాకింగ్: కారులో బోరున ఏడ్చిన సుమ కనకాల! కారణం తెలిస్తే షాక్ అవుతారు!
  • సుమ కనకాల: టాప్ యాంకర్ కెరీర్‌లో ఎన్నో ఒత్తిళ్లు, కష్టాలు!
  • షూటింగ్స్ వల్ల శరీరం అలసిపోయి కారులో బోరున ఏడ్చిన సుమ కనకాల.
  • ఒక నెలలో 50 ఎపిసోడ్స్, నిద్రలేని రాత్రులు గడిపిన సుమ కనకాల.
  • తక్కువ విశ్రాంతితోనే మళ్లీ ఫుల్ రీఛార్జ్ అయిపోతానన్న సుమ!

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె కారులో కూర్చొని బోరున ఏడ్చారట! అసలు సుమ కనకాల ఎందుకు ఏడ్చారు? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడండి.

సుమ కనకాల కన్నీటి వెనుక అసలు కారణం ఇదేనా?

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో తన ఎనర్జీ, టైమింగ్, చమత్కారంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ కనకాల. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు సుమ. స్టేజ్ మీద ఆమె ఉత్సాహం, మాటల సరళి చూసి ఆమెకు ఎలాంటి కష్టం ఉండదేమో అనుకుంటారు చాలామంది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి, అలసట గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

సుమకు ఒక టైంలో చాలా బిజీ షెడ్యూల్స్ ఉండేవట. ఒకే రోజులో పలుచోట్ల షూటింగ్స్, గంటలకొద్దీ నిరంతరంగా నిలబడి మాట్లాడడం, రిహార్సల్స్, లైవ్ ప్రోగ్రామ్స్ వంటివి చేసేవారట. ఒక నెలలో 50 కి పైగా ఎపిసోడ్స్ చేసేవారట. దానివల్ల శరీరమే కాదు.. మనసును కూడా అలసిపోయేదట. కొన్ని రోజులపాటు రాత్రి ఒంటి గంటకు పడుకోవడం తిరిగి 5.30 గంటలకు లేవడం తప్పలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అంత బిజీ టైంలో కూడా పిల్లలకు కావాల్సినవి చేసిపెట్టడం, షూటింగ్స్ మధ్యలో విరామం దొరికినప్పుడు వారితో ఫోన్లో టచ్ లో ఉండటం చేసేవారట.

వరుస షూటింగ్స్ తో ఎంతలా అలసిపోయారో చూడండి!

ఆ ఇంటర్వ్యూలో సుమ ఒక ప్రత్యేకమైన రోజు గురించి గుర్తుచేసుకున్నారు. ఆ రోజు వరుసగా జరిగిన షూటింగ్స్ వల్ల పూర్తిగా అలసిపోయి, శరీరం సహకరించని స్థితికి చేరుకుందని చెప్పారు. బయటకు మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ తన పని పూర్తి చేసినప్పటికీ, లోపల మాత్రం ఎంతగా అలసిపోయిందో ఎవరికీ తెలియదని అన్నారు. షూటింగ్ తర్వాత కార్లో కూర్చొని బోరున ఏడ్చారట సుమ.

అయితే ఎంత అలసిపోయినా, తనకు విశ్రాంతి దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నా చాలు, ఫుల్ రీఛార్జ్ అయిపోతారట సుమ. మళ్లీ షూటింగ్స్ కి హ్యాపీగా వెళ్లిపోతారట. అలా తక్కువ విశ్రాంతితో కూడా తన శరీరం సహకరించడం వరం అని సుమ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నిద్రలేని రాత్రులు, కష్టమైన జీవితం సుమది!

సుమ ఇంటర్వ్యూ చూసిన చాలామంది నెటిజన్లు.. “స్క్రీన్‌పై కనిపించే స్మైల్ వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ప్రేక్షకుల కోసం ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే యాంకర్స్, నటులు కూడా మనలాగ సాధారణ మనుషులే. వారికి కూడా అలసట, ఒత్తిడి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ వారి వృత్తి కారణంగా వాటిని బయటపెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని” కామెంట్ చేస్తున్నారు.

సుమ కనకాల గారి ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పడిన కష్టాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.