|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suma Kanakala : రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..

Published: 18-11-2025, 11:13 PM
Suma Kanakala : రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..

ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన రిటైర్మెంట్‌పై ఇటీవల వచ్చిన వార్తలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సుమ, తనను విమర్శిస్తున్న వారికి తన కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Key Points

1

యాంకర్ సుమ కనకాల దాదాపు 30 ఏళ్లకు పైగా టీవీ, సినిమా రంగంలో కొనసాగుతున్నారు.

2

తన వయసు, రిటైర్మెంట్ గురించి మాట్లాడే వారికి సుమ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

4

ఇప్పట్లో రిటైర్మెంట్ అయ్యే ప్రసక్తే లేదని, ప్రేక్షకుల ప్రేమతో పని చేస్తూనే ఉంటానని సుమ స్పష్టం చేశారు.

సుమ కనకాల: కెరీర్ ప్రస్థానం, రిటైర్మెంట్ చర్చ

Suma Kanakala : యాంకర్ సుమ తన మాటలతో టీవీ షోలలో, సినిమా ఈవెంట్స్ లో అందర్నీ కట్టిపడేసి మెప్పిస్తుంది. తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది సుమ కనకాల. దాదాపు 30 ఏళ్లకు పైగా టీవీ, సినిమా రంగంలో ఉంది సుమ. దాదాపు 20 ఏళ్లకు పైగా యాంకరింగ్ తో అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం సుమకు 50 ఏళ్ళు. అయినా చాలా యంగ్ గా కనిపిస్తూ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది.(Suma Kanakala)

అయితే ఇటీవల కొంతమంది సుమకు ఏజ్ అయిపోతుంది, సుమ తర్వాత ఎవరు, సుమ ఎప్పుడు రిటైర్ అవుతుంది అని పలు కామెంట్స్ చేసారు. కొంతమంది యాంకర్స్ కూడా ఇండైరెక్ట్ గా సుమనే అన్ని కవర్ చేస్తుంది, తమకు ఏమి రావట్లేదు అని పలు సందర్భాలలో అన్నారు. ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. సుమ ప్రేమంటే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది.

‘నాకెందుకు రిటైర్మెంట్?’ – సుమ స్ట్రాంగ్ కౌంటర్

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ కనకాల మాట్లాడుతూ.. మా అమ్మకు 84 ఏళ్ళు. కానీ వెరీ యంగ్. ఆమెకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరెప్పుడు రిటైర్ అవుతారు అని. నేనెందుకు రిటైర్ అవ్వాలి. మా ఫ్యామిలీలో జెనెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 ఏళ్ళు బతికింది. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్ళు. ఇప్పటికి అడ్వకెట్ గా పనిచేస్తున్నారు. గిన్నిస్ రికార్డ్ హోల్డర్. నన్ను ఎందుకు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి. నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఇలానే వర్క్ చేస్తూ ఉంటాను. స్టేజిపైకి నేను వచ్చాక మీ అరుపుల్లో, సుమ అక్క అని మీరు అరిచే అరుపుల్లో ప్రేమ ఉంది. అవి చూసి అయినా నేను ఇప్పట్లో రిటైర్ అవ్వను అని తెలిపింది.

కుటుంబ నేపథ్యం, భవిష్యత్ ప్రణాళికలు

దీంతో సుమ రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించకూడదు అని క్లారిటీ వచ్చేసింది. తన రిటైర్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళకు సుమ ఈ రకంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సుమ తన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి ఇంకో 10 ఏళ్ళ పైనే యాంకరింగ్ ఇలాగే చేసినా ఆశర్యపోనవసరం లేదు.

మొత్తంగా, సుమ కనకాల రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తన దీర్ఘకాలిక కెరీర్‌ను కొనసాగించాలనే ఆమె నిశ్చయించుకున్నట్లు స్పష్టమైంది. ప్రేక్షకుల ప్రేమ, తన ఆరోగ్యం ఉన్నంత కాలం ఆమె అలరిస్తూనే ఉంటారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.