
యాంకర్ సుమ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమెకు వచ్చే కొన్ని కలలు నిజమవుతాయని, రెండో ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ కనకాల కాలు విరిగిన సంఘటనతో తనకు భయం కలిగిందని సుమ వివరించారు. ఈ వివరాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
యాంకర్ సుమ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.
ఆమెకు వచ్చే కొన్ని కలలు నిజమవుతాయని, అవి కొన్నిసార్లు భయం కలిగిస్తాయని సుమ తెలిపారు.
రెండో ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ కనకాల కాలు విరిగినట్లు కల వచ్చి, అది నిజమైంది.
సెల్ ఫోన్లు లేని ఆ రోజుల్లో రాజీవ్ షూటింగ్ లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
సుమకు నిజమయ్యే కలలు: ఆసక్తికర వివరాలు
Suma Rajeev Kanakala : యాంకర్ సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడిగా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. సుమ – రాజీవ్ కనకాల జంట ఎప్పుడు కలిసి కనిపించినా ఫ్యాన్స్ సంతోషిస్తారు. తాజాగా యాంకర్ సుమ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Rajeev Kanakala)
ఈ క్రమంలో సుమ తనకు కలలు వస్తాయని, ఒక్కోసారి ఆ కలలు నిజం అవుతాయి. ఆ విషయంలో భయం వేస్తుంది అని ఓ సంఘటన గురించి తెలిపింది.
ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ కనకాలకు ప్రమాదం
సుమ కనకాల మాట్లాడుతూ.. నాకు వచ్చే కొన్ని డ్రీమ్స్ నిజం అవుతాయి. రాజీవ్ ఏ ఫిలిం బై అరవింద్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రగ్నెంట్. సెకండ్ టైం ప్రగ్నెన్సీ. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. ఆయన కొండ మీద నుంచి పడిపోయి కాలు ట్విస్ట్ అయి నన్ను చూస్తూ కాలు విరిగింది అని అరుస్తున్నట్టు కల వచ్చింది. నెక్స్ట్ డే నాకు అసలు అతను కాంటాక్ట్ లోకి రాలేదు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. ల్యాండ్ లైన్స్ లోనే మాట్లాడాలి.
కలలు నిజమైనప్పుడు సుమకు కలిగే భయం
రాజీవ్ తలకోనలో షూటింగ్ లో ఉన్నాడు. ఒక రోజు గ్యాప్ తర్వాత ఆయన కాల్ చేసారు. నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే బాగానే ఉన్నాను ఎందుకు అడుగుతున్నావు అంటే నాకు వచ్చిన కల చెప్పాను. అప్పుడు రాజీవ్ కూడా షాక్ అయి నిజంగానే నా కాలు విరిగింది. షూట్ లో చెట్టుకు వెళ్లి గుద్దుకొని కాలు కి మోకాలు దగ్గర దెబ్బ తగిలింది అని చెప్పాడు. అప్పటికప్పుడు నేను బయలుదేరి వెళ్లి ఆయనకు బేసిక్ ట్రీట్మెంట్, పుత్తూరు కట్టు కట్టించాను. కానీ ఆయన షూటింగ్ మధ్యలో ఆపడం వద్దు, అందరు లాస్ అవుతారు అని షూటింగ్ చేసి వస్తా అన్నాడు. ఇలాంటి డ్రీమ్స్ కొన్ని జరిగాయి. అప్పుడప్పుడు ఈ డ్రీమ్స్ వల్ల భయం వేస్తుంది నాకు అని తెలిపింది.
సుమ వెల్లడించిన ఈ సంఘటనలు ఆమెకు భవిష్యత్తు గురించి భయాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ కనకాలతో ఆమె బంధం, అనుభవాలు అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేస్తున్నాయి. ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి.


