|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ బంధం ఆగనిది.. సుమన్‌ అంటే ఫ్లవర్‌ అనుకుంటిరా.. వైల్డ్‌ ఫైర్‌!

Published: 17-10-2025, 2:26 AM
ఈ బంధం ఆగనిది.. సుమన్‌ అంటే ఫ్లవర్‌ అనుకుంటిరా.. వైల్డ్‌ ఫైర్‌!

బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దివ్వెల మాధురి తన రూల్స్‌తో అందరినీ ఇబ్బంది పెట్టగా, దివ్య-భరణి బంధం కన్నీళ్లకు దారితీసింది. సుమన్ షెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కెప్టెన్సీ రేసులో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 16 ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ.

Key Points

1

దివ్వెల మాధురి తన ఆరోగ్యం పేరుతో హౌస్‌లో కొత్త రూల్స్ పెట్టి కంటెస్టెంట్లతో గొడవపడింది.

2

భరణి, దివ్య మధ్య అపార్థాలు తలెత్తి, ఇద్దరూ చిన్నపిల్లల్లా ఏడ్చి ఒకరినొకరు ఓదార్చుకున్నారు.

4

రమ్య వంటకాల కోసం దొంగతనాలకు సిద్ధమవుతూ సంజనా 2.0 అవుతానని ప్రకటించింది.

దివ్వెల మాధురి ‘మహారాణి’ రూల్స్

దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్‌ 16) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

నా ఆరోగ్యం పాడైపోతోంది లైట్లు ఆఫ్‌ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్‌ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్‌ పెట్టింది మాధురి ( Divvala Madhuri ). ఇదేమైనా బిగ్‌బాస్‌ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్‌ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు… నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.

దివ్య-భరణి బంధంలో కన్నీళ్లు

దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్య ఇక రమ్య ఆర్డర్‌ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్‌బాస్‌ . సుమన్‌తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్‌గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్‌.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్‌ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.

ఏడ్చేసిన భరణి- దివ్య చెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్‌ చేసేంత సీన్‌ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్‌బాస్‌ వైల్డ్‌కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్‌ చేసుకుని గేమ్‌ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్‌షిప్‌ కాపాడుకోవాలన్నారు.

సుమన్ షెట్టి వైల్డ్ ఫైర్‌గా కెప్టెన్సీ రేసులో

ఇద్దరు కెప్టెన్స్‌ అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్‌ ( Suman Shetty )ను ఎంపిక చేసుకుని బాల్‌ టాస్క్‌ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్‌, శ్రీనివాస్‌.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్‌ కార్డులతో పాటు చివరి వరకు సుమన్‌ నిలిచి కెప్టెన్సీ కంటెండర్‌ అయ్యాడు. సూపర్‌ పవర్‌ ఉన్న నిఖిల్‌ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్‌లో కెప్టెన్సీ టాస్క్‌ ఈపాటికే అయిపోయింది. గౌరవ్‌, సుమన్‌ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్‌ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు.

బిగ్ బాస్ ఇంట్లో రోజుకో మలుపు, కొత్త నాటకాలు, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. సుమన్ షెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, కెప్టెన్సీ రేసును మరింత ఉత్కంఠగా మార్చింది. ఈ సంఘర్షణలు, బంధాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.