|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Suman Shetty: లైఫ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కోసం సుమన్‌ శెట్టి చేసిన పని తెలిస్తే సలామ్‌ కొట్టాల్సిందే

Published: 17-09-2025, 8:50 AM
Suman Shetty: లైఫ్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కోసం సుమన్‌ శెట్టి చేసిన పని తెలిస్తే సలామ్‌ కొట్టాల్సిందే

కమెడియన్ సుమన్ శెట్టి ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో ఉన్నారు. తాజాగా ఆయన గురించి దర్శకుడు తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తేజ గారి ‘జయం’ సినిమాతో సుమన్ శెట్టి జీవితంలో మలుపు వచ్చింది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9లో సుమన్ శెట్టి సందడి

2

డైరెక్టర్ తేజతో సుమన్ శెట్టికి ఉన్న ప్రత్యేక బంధం

4

తేజ రుణం తీర్చుకోవడానికి సుమన్ శెట్టి చేసిన పని అద్భుతం

బిగ్ బాస్ లో సుమన్ శెట్టి

కమెడియన్‌ సుమన్‌ శెట్టి ప్రస్తుతం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లో సందడి చేస్తున్నారు. మొదటి వారం కాస్త కామ్‌ గా ఉన్న ఆయన నెమ్మదిగా తన కామెడీ స్టార్ట్ చేశాడు. నామినేషన్‌లో రెచ్చిపోయాడు. ఓ వైపు కౌంటర్లు ఇస్తూనే మరోవైపు కామెడీ చేస్తున్నారు. రెండు మిక్స్ చేసి కొడుతున్నాడు. అయితే మిగిలిన వారిలా ముచ్చట్లకు దూరంగా ఉంటున్నాడు. కెమెరాలో కనిపించాలనే తాపత్రయం కనిపించడం లేదు. టాస్క్ ల్లో మాత్రం బెస్ట్ ఇస్తున్నాడు. తన పనేదో తాను చేసుకుంటున్నారు. ఎక్కువగా ఇతరులతో మింగిల్‌ అయినట్టు కనిపించడం లేదు.

అయినా మొదటి వారం నామినేషన్‌లో ఉన్నాడు సుమన్‌ శెట్టి. యాక్టివ్‌గా ఉండటం లేదని హరీష్‌ ఆయన్ని నామినేట్‌ చేశాడు. కానీ సుమన్‌ శెట్టికి విపరీతమైన ఓటింగ్‌ పడింది. ఆ ఓటింగ్‌ చూస్తుంటే సుమన్‌ శెట్టి ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు సుమన్‌ శెట్టి. ఆ తర్వాత కనిపించలేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి ఆడియెన్స్ వరకు వెళ్లలేదు. దీంతో ఆయన విషయంలో గ్యాప్‌ వచ్చింది. దీంతో చాలా రోజుల తర్వాత సుమన్‌ శెట్టి కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. ఆయన్ని ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ ఓటింగ్‌ రూపంలో చూపిస్తున్నారు.

తేజ దర్శకత్వం వహించిన ‘జయం’

ఇదిలా ఉంటే తాజాగా సుమన్‌ శెట్టి గురించి దర్శకుడు తేజ చెప్పిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్‌ శెట్టి గురించి వెల్లడించారు. ఆయన రూపొందించిన `జయం` చిత్రంలో సుమన్‌ శెట్టికి ఆఫర్‌ ఇచ్చారు తేజ. ఆ సినిమా సుమన్‌ శెట్టి లైఫ్‌నే మార్చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. స్టార్‌ కమెడియన్‌ అయ్యాడు. ఇండస్ట్రీని శాసించాడు. ఆర్థికంగానూ బాగా ఎదిగాడు. సొంతంగా ఇళ్లు కట్టుకున్నాడు. అయితే ఓ సందర్భంగా సుమన్‌ శెట్టి కలిసి మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువుగారు అని తేజని అడిగితే, వచ్చిన డబ్బులతో మంచి ల్యాండ్‌ కొనుక్కొని ఇళ్లు కట్టుకో అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇళ్లు కట్టుకున్నాడు సుమన్‌ శెట్టి.

రుణం తీర్చుకున్న విధానం

ఆ తర్వాత మరోసారి వచ్చి సార్‌ మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడిగితే, “ఏం వద్దు, ఇప్పుడు తాను కొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నా. ఏదో రోజు అన్ని కోల్పోయి రోడ్డుమీదకు వస్తాను. ఆ టైమ్‌లో నాకు ఉండటానికి ఒక రూమ్‌ ఇవ్వు అన్నాను. నేను చెప్పినట్టుగానే నాకోసం ఒక రూమ్‌ కట్టాడు. అందులో నా ఫోటో పెట్టుకున్నారు. రోజూ దాన్ని క్లీన్‌ చేస్తున్నాడు“ అని తెలిపారు తేజ. సుమన్‌ శెట్టి కృతజ్ఞతాభావాన్ని, గొప్ప మనసుని వెల్లడించారు తేజ. జీ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ ఈ విషయం చెప్పారు. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.

సుమన్ శెట్టి తన గురువు తేజకు చేసిన కృతజ్ఞత చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇటువంటి విశ్వాసమైన బంధాలు టాలీవుడ్ లో అరుదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.