|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వేసవిలో వర్ష కాలాన్ని చూపించడం అంత ఈజీ కాదు.. తుంబాడ్, 2018 సినిమాలకు ఏమాత్రం తీసిపోదు.. సినిమాటోగ్రాఫర్ కామెంట్స్

Published: 25-08-2025, 7:08 AM
వేసవిలో వర్ష కాలాన్ని చూపించడం అంత ఈజీ కాదు.. తుంబాడ్, 2018 సినిమాలకు ఏమాత్రం తీసిపోదు.. సినిమాటోగ్రాఫర్ కామెంట్స్

సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి తన లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. వేసవిలో వర్షం సన్నివేశాలు చిత్రీకరించడంలో ఎదురైన సవాళ్ళు, సినిమా యొక్క ప్రత్యేకతల గురించి ఆయన వివరించారు.

Key Points

1

వేసవిలో వర్షం సన్నివేశాల చిత్రీకరణలో ఎదురైన సవాళ్ళు

2

‘తుంబాడ్’, ‘2018’ సినిమాలతో పోల్చదగిన విజువల్స్

4

కథాంశం, క్లైమాక్స్ ప్రాధాన్యత

త్రిబాణధారి బార్బరిక్ చిత్రీకరణ సవాళ్ళు

పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో కెమెరామెన్‌గా కుశేందర్ రమేష్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. ఆయన సినిమాటోగ్రఫర్‌గా పని చేసిన లేటెస్ట్ మూవీ ‘ త్రిబాణధారి బార్బరిక్ ’ ఆగస్ట్ 29న రాబోతోంది.

ఈ నేపథ్యంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన త్రిబాణధారి బార్బరిక్ గురించి, మరీ ముఖ్యంగా విజువల్స్ గురించి, సినిమాకు పడిన కష్టంతోపాటు మూవీకి సంబంధించిన విశేషాలను సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి పంచుకున్నారు.

-‘ రజాకార్ ’ చివరి షెడ్యూల్‌లో ఉన్నప్పుడు దర్శకుడు మోహన్ ఈ కథ గురించి చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. కథ విన్న తరువాత నా సలహాలు, సూచనలు చెప్పాను.

విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేకతలు

-ఎలాంటి కలర్ గ్రేడింగ్, ప్యాట్రన్ వాడితే బాగుంటుందనే రిఫరెన్సులు కూడా ఇచ్చాను. అవన్నీ కూడా మారుతి గారికి చాలా నచ్చాయి. దీంతో దర్శకుడు మోహన్, నిర్మాత విజయ్, నేను కలిసి ఈ ప్రాజెక్ట్‌ని అలా మొదలు పెట్టాం.

-‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ ఎక్కువగా రాత్రి పూట, రెయిన్ ఎఫెక్ట్స్‌లోనే షూటింగ్ చేశాం. వేసవి కాలంలో రెయిన్ సీజన్‌ ఎఫెక్ట్‌ను చూపించడం అంత సులభం కాదు. అదే మాకు పెద్ద ఛాలెంజింగ్. ఎండాకాలంలో వానాకాలాన్ని సృష్టించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.

-ఈ విషయంలో మాత్రం నిర్మాత విజయ్ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కథ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మొదటి సినిమా అయినా కూడా కథ మీద నమ్మకంతో ఆయన భారీ బడ్జెట్‌ను పెట్టారు.

కథాంశం మరియు క్లైమాక్స్

-‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో ప్రతీ పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో పాత్రకు సపరేట్ కలర్ గ్రేడింగ్ వాడాము. ఒక్కో పాత్ర రూపాంతరం చెందుతున్న తీరుకి తగ్గట్టుగా కలర్ గ్రేడింగ్ మారుతుంది. ఇక రెయిన్ ఎఫెక్ట్ సీన్లను చూస్తే ఎంతో సహజంగా అనిపిస్తాయి. ‘ తుంబాడ్ ’, ‘2018’ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎంతో నేచురల్‌గా కనిపిస్తుంది.

-‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీకి ప్రధాన బలం కథ. స్క్రిప్ట్ విన్నప్పుడే ఈ మూవీని చేయాలని ఫిక్స్ అయ్యాను. ‘ పొలిమేర ’, ‘రజాకార్’ కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఈ మూవీ కథను విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు. ఈ మూవీకి క్లైమాక్స్ అద్భుతంగా సెట్ అయింది.

చివరగా, ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా యొక్క కథాంశం, క్లైమాక్స్ మరియు విజువల్స్ అద్భుతంగా ఉంటాయని సినిమాటోగ్రాఫర్ తెలిపారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.