|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిలీజ్‌కు ముందే భారీ ధరకు సుందరకాండ ఓటీటీ రైట్స్

Published: 26-07-2025, 10:45 PM
రిలీజ్‌కు ముందే భారీ ధరకు సుందరకాండ ఓటీటీ రైట్స్

టాలీవుడ్ లో నాన్-థియేట్రికల్ బిజినెస్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో, నారా రోహిత్ సుందరకాండ సినిమా రిలీజ్ కు ముందే రూ.12 కోట్లకు ఓటీటీ హక్కులను అమ్ముకుని సంచలనం సృష్టించింది.

Key Points

1

సుందరకాండ సినిమా ఓటీటీ హక్కులు రూ.12 కోట్లకు అమ్ముడయ్యాయి.

2

రిలీజ్ కు ముందే ఈ భారీ డీల్ జరిగింది.

4

సినిమా కంటెంట్ బలంగా ఉండటం వల్లే ఈ డీల్ సాధ్యమైంది.

సుందరకాండ: రికార్డు స్థాయి ఓటీటీ డీల్

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఒక సినిమాకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కరోనా తరువాత నాన్-థియేట్రికల్ మీదనే భారీ బడ్జెట్‌తో పాటు మామూలు సినిమా మేకర్స్ ఆధారపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ ఒక జాక్ పాట్ కొట్టింది.

సుందరకాండ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌ను భారీ ధరకు రికార్డ్ స్థాయిలో చేసింది. ఏకంగా రూ. 12 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించి సంచలనం సృష్టించింది సుందరకాండ సినిమా.

సుందరకాండ మూవీ డిజిటల్ (ఓటీటీ) అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ రూ. 9 కోట్లు, హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ను రూ. 3 కోట్లకు అమ్మేసి మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 12 కోట్లు సాధించడం మామూలు విషయం కాదు.

జియో హాట్‌స్టార్ ద్వారా సుందరకాండ స్ట్రీమింగ్

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అసలు ఇటీవల కాలంలో నాన్-థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టమైపోయింది. కానీ, సుందరకాండ సినిమాను హాట్‌స్టార్‌ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట.

కంటెంట్ మీద నమ్మకంతో సుందరాకాండ టీం హాట్ స్టార్‌ను సంప్రదించి సినిమాను చూపించి మరీ డీల్ క్లోజ్ చేయడం గమనార్హం. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం అంటే సుందరకాండ కథ, కంటెంట్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బలమైన కంటెంట్ ఉంటే ఓటీటీ సంస్థ లు భారీగా వెచ్చించి కొనుగోలు చేస్తాయని నిరూపించింది ఈ సుందరాకాండ. ఇక సుందరకాండ మూవీ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అంటే, ఇంకా నెలరోజుల సమయం ఉండగానే సుందరకాండ ఓటీటీ హక్కులు, టీవీ ప్రీమియర్ రైట్స్ అమ్ముడుపోవం విశేషంగా మారింది.

సినిమా కంటెంట్ ప్రభావం

థియేట్రికల్ రన్ తర్వాత జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో సుందరకాండ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే, నారా రోహిత్ కెరీర్‌లో 20వ చిత్రంగా వస్తున్న సుందరకాండ సినిమాతో వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సుందరకాండ సినిమాలో ప్రభాస్ ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్‌తో పాటు వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే సుందరకాండ టీజర్‌కి ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చింది.

సుందరకాండ సినిమా ఓటీటీ హక్కుల అమ్మకం టాలీవుడ్ లో కొత్త ధోరణిని సూచిస్తుంది. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉందని ఈ డీల్ నిరూపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.