
కమెడియన్‌గా ప్రారంభించి హీరో, విలన్‌గా మెప్పించిన సునీల్, తన కొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘ఫైటర్ శివ’ టీజర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు.
Key Points
సునీల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఫైటర్ శివ' టీజర్ విడుదల.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ అద్భుతమైన నటన.
మణికాంత్, ఐరా బన్సాల్, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న, మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్.
ఫైటర్ శివ టీజర్ విడుదల
కమెడియన్‌గా కెరీర్ స్టార్ చేసిన సునీల్ హీరోగా అదరగొట్టారు. ఆ తర్వాత విలన్‌గా నటించి మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకున్న సునీల్ మరోసారి యాక్షన్‌తో అలరించేందుకు రెడీగా ఉన్నారు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఫైటర్ శివ.
కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ ‘ఫైటర్ శివ’ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. ఫైటర్ శివ సినిమాలో సునీల్ ప్రధాన పాత్ర పోషించగా మణికాంత్, ఐరా బన్సాల్ హీరో హీరోయిన్స్‌గా జంటగా నటించారు.
అలాగే, ఫైటర్ శివ మూవీలో సునీల్‌తోపాటు సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ట కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే, శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఫైటర్ శివ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
సునీల్ యాక్షన్ రోల్
ఆద్యంతం యాక్షన్స్‌తో ఫైటర్ శివ టీజర్ సాగింది. సినిమాలో సునీల్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్‌తోపాటు వికాస్ వశిష్ట కూడా పోలీస్ రోల్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, టీజర్‌లో వచ్చిన రెండు మూడు డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపించాయి.
‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’ అని సునీల్ చెప్పిన డైలాగ్ ‘నేను పవన్ కల్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ అని మణికాంత్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు.
ఈ ‘ఫైటర్ శివ’ టీజర్‌ను గమనిస్తే ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మాస్ కమర్షియల్ సినిమాని చూడబోతోన్నామని అర్థం అవుతోంది. అలాగే, టీజర్‌లో సునీల్, వశిష్ట, మణికాంత్‌తోపాటు పోలీస్‌గా మరో నటుడు యాక్షన్‌తో మెప్పించారు. అయితే, సినిమాలో ఎవరు హీరో ఎవరు విలన్ అనేది తెలియకుండా చాలా బాగా టీజర్ కట్ చేశారు.
నటీనటుల వివరాలు
చూస్తే సినిమాలో నలుగురు హీరోలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్‌గా చేసిన ఐరా బన్సాల్ గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది. హీరో మణికాంత్ ఫైట్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్‌లో మణికాంత్ ప్రజెన్స్ బాగుంది.
ఫైటర్ శివ సినిమాలో మణికాంత్, ఐరా బన్సాల్, సునీల్, వికాస్ వశిష్టతోపాటు మధుసూదన్, యోగి ఖత్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శాన్విత్ నిమ్మల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సునీల్ యొక్క పవర్‌ఫుల్ పోలీస్ పాత్రతో పాటు, మిగతా నటీనటుల నటన కూడా ఆకట్టుకుంటుందని టీజర్ హామీ ఇస్తోంది. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


