
📌 Key Points
- సునీల్ మాస్ డ్యాన్స్ స్టెప్పులతో ‘మజాకో మల్లికా’ సాంగ్ అదిరింది!
- పాన్ ఇండియా మూవీగా మే 14న విడుదల కానున్న ‘కాటాలన్’!
- దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నిర్మాణంలో భారీ యాక్షన్ థ్రిల్లర్!
టాలీవుడ్ స్టార్ సునీల్ మరోసారి తన మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఆయన నటించిన ‘కాటాలన్’ చిత్రం నుంచి విడుదలైన ‘మజాకో మల్లికా’ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
‘మజాకో మల్లికా’ సాంగ్‌తో సునీల్ దుమ్మురేపాడు!
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మజాకో మల్లికా’ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్‌లో అదరగొట్టారు. ఐటెం నంబర్‌గా వహ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ సాంగ్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో కూడా విడుదలై ఆకట్టుకుంటోంది. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా.. అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో పాటు మునిపెన్నడూ చూడని స్టంట్ సన్నివేశాలు అలరించాయి. దీంతో కాటాలన్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడగా.. మే 14న భారీ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా.. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పుష్ప ఫేమ్ రాజ్ తరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా మే 14న విడుదల!
యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన టీజర్!
కాటాలన్ చిత్రం మే 14న విడుదల కానుంది. సునీల్ మాస్ అవతార్‌లో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


