|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సునీల్ లైఫ్ లో ఇంత విషాదం ఉందా? తల్లి చేసిన సాహసానికి షాక్ అవ్వాల్సిందే!

Published: 16-03-2026, 11:35 PM
సునీల్ లైఫ్ లో ఇంత విషాదం ఉందా? తల్లి చేసిన సాహసానికి షాక్ అవ్వాల్సిందే!
  • సునీల్ తండ్రి మరణం తర్వాత తల్లి నాగమణి రెండో పెళ్లి చేసుకోలేదు – పిల్లల భవిష్యత్తు కోసమే త్యాగం!
  • చిన్నతనంలో సునీల్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు – తల్లి అతన్ని సరైన దారిలో పెట్టింది, ప్రోత్సహించింది.
  • పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వచ్చినా, చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించింది నాగమణి.
  • సునీల్ ఈ స్థాయికి రావడానికి కారణం తల్లి నాగమణి కష్టం, ప్రోత్సాహమే అని స్వయంగా వెల్లడి!

టాలీవుడ్ కమెడియన్ సునీల్ గురించి ఓ షాకింగ్ న్యూస్! ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తల్లి నాగమణి చేసిన త్యాగం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సునీల్ జీవితంలో విషాదం

కమెడియన్‌ సునీల్‌ ఇప్పుడు విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఒకప్పుడు కమెడియన్‌గా పాపులర్‌ అయ్యాడు. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. హీరోగానూ సక్సెస్‌ అయ్యాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్లు పడలేదు. దీంతో రూట్‌ మార్చాడు. మూసధోరణితో కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించాడు. తనని తాను మార్చుకున్నాడు. ఇప్పుడు కమెడియన్‌గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. సునీల్‌ ఇప్పుడు తెలుగులోనే కాదు, తమిళంలోనూ బిజీ యాక్టర్‌. బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

సునీల్ సినిమాల్లోకి రావడానికి, ఇంతటి పెద్ద స్టార్‌గా ఎదగడానికి కారణం ఆయన తల్లి నాగమణినే కారణం. ఆమె సునీల్‌కి అమ్మ అయ్యింది. నాన్న కూడా అయ్యింది.  ఆమె ఒక్కరే సునీల్‌తోపాటు ఆయన చెల్లిని పెంచి పెద్దచేసి ప్రయోజకుల్ని చేసింది. ఈ కమెడియన్‌ సినిమాల్లోకి వచ్చేలా ప్రోత్సహించింది. ఆయన టాలెంట్‌ని చూసి ఎంకరేజ్‌ చేసింది. నువ్వు సాధిస్తావనే ధైర్యాన్నిచ్చింది. అల్లరి చిల్లరగా ఉండే సునీల్‌ని సరైన దారిలో పెట్టింది. గొప్పవాడిగా తయారు చేసింది. సునీల్‌ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం ఆయన తల్లి నాగమణి కష్టం, కృషి, ప్రోత్సాహమే. ఈ విషయాన్ని సునీల్‌ స్వయంగా వెల్లడించారు.

తల్లి నాగమణి త్యాగం

సునీల్‌ ఆరేళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ సమయంలో ఆయన తల్లి ఏజ్‌ 21ఏళ్లు. అంత చిన్న వయసులో భర్త మరణించాడంటే చాలా మంది రెండో పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని అత్తారింటి వద్ద వదిలేస్తారు. కానీ సునీల్‌ అమ్మ మాత్రం అలా చేయలేదు. పిల్లలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలని చెప్పి, రెండో పెళ్లికి నో చెప్పింది. ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చాలా ఒత్తిడి తెచ్చినా వినలేదు. పిల్లలకోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. భర్త పోస్ట్ మాస్టర్‌ జాబ్‌ ఆమెకి వచ్చింది. చాలీచాలనీ జీతంతోనే కుటుంబాన్ని పోషించింది.

చిన్నప్పుడు సునీల్‌ అల్లరి చిల్లరగానే ఉండేవాడు. రోజూ సినిమాలు చూసేవాడట. స్కూల్‌కి వెళ్లి సినిమాలకు వెళ్లేవాడట. ఇలా రోజూ దొరికిపోయేవాడు. దీంతో అమ్మ గట్టిగానే మందలించింది. రోజూ వద్దూ ఆదివారం చూడాలని చెప్పిందట. అలాగే సునీల్‌ ఇంట్లో భోజనం కంటే బయట బిర్యానీలు ఎక్కువగా తినేవాడట. దీంతో రోజూ ఇంట్లో అన్నం వేస్ట్ అయ్యేది. దీనితో ప్రతి ఆదివారం తాను బిర్యానీ చేస్తానని చెప్పి ఒప్పించిందట. ఇలా ప్రతి విషయంలో సునీల్‌ని గైడ్‌ చేసింది, సరైన దారిలో పెట్టింది. అతనికి సినిమాలపై ఉన్న ఆసక్తిని ఎంకరేజ్‌ చేసింది. డిగ్రీ అయిపోయాక పీజీ ప్రైవేట్‌లో ఎప్పుడైనా చేయోచ్చు, సినిమా ప్రయత్నాలు చేయాలని ప్రోత్సహించిందట. దీంతో హైదరాబాద్‌కి సునీల్‌ వచ్చేశాడు. ఇక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దాదాపు ఐదేళ్లపాటు ప్రతి నెల మూడు వేలు పంపించిందట.

సునీల్ సక్సెస్ వెనుక తల్లి ప్రోత్సాహం

తొలి చిత్రంలో అసిస్టెంట్‌గా చిన్న పాత్రలో కనిపిస్తే, ఊర్లో అంతా విమర్శలు చేశారు. మొదట చిన్న సర్వర్‌ పాత్రలో కనిపించాడు. డైలాగులు కూడా లేవు. ఇలా సర్వర్‌గా నిల్చోవడానికేనా సినిమాల్లోకి వెళ్లింది, దీనికే ఇన్నేళ్లు పట్టిందా అంటూ నానా రకాలుగా అన్నారట. ఆ సమయంలో వాళ్ల అమ్మే ఫోన్‌ చేసి ధైర్యం చెప్పిందట. ఫస్ట్ టైమ్‌ తెరపై చూసినందుకు ఆమె హ్యాపీ అయ్యింది. అలాగే మంచి రోల్స్ కోసం ప్రయత్నించమని చెప్పిందట. `నువ్వే కావాలి` సినిమాలో మంచి పాత్ర పడింది. తన తొలి సంపాదనతో అమ్మకి చీరకొనిచ్చాడు సునీల్‌.   ఆమె దాన్ని అపురూపంగా భావించి దాచుకుందట. తాను ఇంతటి సక్సెస్‌ అయ్యానంటే అమ్మే కారణమని చెప్పాడు సునీల్‌. తన కామెడీ, సెన్సాఫ్‌ హ్యూమర్‌, సరదాగా ఉండే తత్వం అన్నీ అమ్మ నుంచే వచ్చాయని చెప్పాడు, గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

సునీల్ జీవితంలో ఆయన తల్లి పోషించిన పాత్ర ఎంతో గొప్పది. ఆమె చేసిన త్యాగానికి వెల కట్టలేం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.