|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సన్నీ లియోన్‌కు షాక్: మధురలో న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు వెనుక అసలు కారణమిదే!

Published: 30-12-2025, 7:23 PM
సన్నీ లియోన్‌కు షాక్: మధురలో న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు వెనుక అసలు కారణమిదే!
  • మధురలో సన్నీ లియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ తీవ్ర నిరసనల మధ్య రద్దు చేయబడింది.
  • శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఇలాంటి కార్యక్రమాలు వద్దంటూ స్థానిక సాధువులు, ఆధ్యాత్మిక సంఘాల అభ్యంతరం.
  • జనవరి 1న జరగాల్సిన డీజే నైట్ ఈవెంట్ టిక్కెట్లు కూడా అమ్ముడయ్యాయి.
  • జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మధురలో జరగాల్సిన సన్నీ లియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దయింది. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో అశ్లీల కార్యక్రమాలు వద్దంటూ స్థానిక సాధువులు, ఆధ్యాత్మిక సంఘాలు తీవ్ర నిరసన తెలపడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సన్నీలియోన్‌కు ఊహించని షాక్

2025కు గుడ్ బై చెప్పి.. 2026కు వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. ఇందుకోసం నటీనటులు, సింగర్లు, ఇతర కళాకారులతో ప్రజలను అలరించేందుకు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు రెడీ అవుతున్నాయి. కానీ.. న్యూ ఇయర్ ఈవెంట్ కు నిర్వహించేందుకు రెడీ అయిన సన్నీలియోన్ కు ఊహించని షాక్ తగిలింది. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో ఆమె ఈవెంట్ రద్దయింది. స్థానిక సాదువులు, ఆధ్యాత్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

జనవరి 1వతేదీన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ లో సన్నీలియోన్ తో మెగా ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. సన్నీలియోన్ తో డీజే నైట్ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. కానీ.. శ్రీకృష్ణుడు పుట్టిన పవిత్రమైన గడ్డపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక హిందూ సంఘాలు, సాదువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భజనలు, కీర్తనలు, ప్రవచనాలు జరగాల్సిన చోట అశ్లీలతను ప్రోత్సహించేలా వేడుకలు జరపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ సహా పలు ధార్మిక సంస్థలు ఈ ఈవెంట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ కు కంప్లైంట్ చేశారు. రద్దు చేయకపోతే ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో.. ఆ హోటల్ యాజమాన్యం దిగొచ్చింది. వారి మనోభావాలను గౌరవిస్తూ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

సాధువులు, ఆధ్యాత్మిక సంఘాల నిరసన

నిర్వాహకుల కీలక నిర్ణయం: ఈవెంట్ రద్దు

సాధువుల నిరసనలు, హెచ్చరికల నేపథ్యంలో నిర్వాహకులు వారి మనోభావాలను గౌరవిస్తూ సన్నీ లియోన్ ఈవెంట్ ను రద్దు చేశారు. ఇది పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను, స్థానిక మతపరమైన విలువలను గౌరవించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.