|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ ఎంట్రీ: సూపర్ హీరో బాబు లో అర్జున్ దాస్ & శాండీ మాస్టర్ కాంబో!

Published: 10-07-2026, 10:10 AM
మాస్ ఎంట్రీ: సూపర్ హీరో బాబు లో అర్జున్ దాస్ & శాండీ మాస్టర్ కాంబో!

తమిళ నటుడు అర్జున్ దాస్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ మాస్టర్ కలిసి నటిస్తున్న సూపర్ హీరో బాబు సినిమా అప్‌డేట్ వైరల్ అవుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Key Points

1

తమిళ నటుడు అర్జున్ దాస్, డ్యాన్స్ మాస్టర్ శాండీ మాస్టర్ కలిసి నటిస్తున్న సూపర్ హీరో బాబు.

2

తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వంలో రూపొందుతోంది.

4

షూటింగ్ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది; త్వరలో రిలీజ్.

అర్జున్ దాస్ & శాండీ మాస్టర్ కాంబో

Super Hero Babu : తమిళ నటుడు అర్జున్ దాస్, నటుడు, డ్యాన్స్ మాస్టర్ శాండీ మాస్టర్ కలిసి నటిస్తున్న సినిమా సూపర్ హీరో. తెలుగులో ఈ సినిమా ‘సూపర్ హీరో బాబు’ అనే టైటిల్ తో రాబోతుంది. జాతీయ అవార్డు గ్రహీత నిర్మాత కె.ఎస్. సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌ సమర్పణలో రెడాక్టెడ్ స్టూడియోస్ బ్యానర్ పై శంజన్ జి నిర్మాణంలో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.

ద్విభాషా చిత్రంగా సూపర్ హీరో బాబు

అర్జున్ దాస్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళ సినిమాలతో దగ్గరయి ఇటీవలే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో మెప్పించాడు. మరో వైపు డ్యాన్స్ మాస్టర్ శాండీ ఇప్పుడు నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. లోక చాప్టర్ 1, తెలుగులో కిష్కిందపురి సినిమాలతో తన నటనతో అదరగొట్టేసారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సూపర్ హీరో తరహా సినిమా చేయబోతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

షూటింగ్ పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ లో

శాండీ మాస్టర్, అర్జున్ దాస్ కాంబోలోని ఈ సినిమాల్లో సీన్స్ హైలెట్ గా ఉండనున్నాయట. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

అర్జున్ దాస్ మరియు శాండీ మాస్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సూపర్ హీరో బాబు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం స్టే ట్యూన్డ్!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.