|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వెంట్రుకవాసు తప్పుతో చస్తారు.. 7 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Published: 16-06-2025, 7:18 AM
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. వెంట్రుకవాసు తప్పుతో చస్తారు.. 7 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

7 IMDb రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. వెంట్రుకలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో కూడిన ఈ హారర్ థ్రిల్లర్ చూసి భయపడటానికి సిద్ధంగా ఉండండి!

Key Points

1

7 రేటింగ్ పొందిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్!

2

వెంట్రుకలు నిక్కబొడుచుకునే భయంకరమైన సన్నివేశాలు!

4

భారతదేశంలో త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది!

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీ విడుదల

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరు. వెంట్రుక వాసు తప్పుతో ఎంతో మంది మరణిస్తుంటారు. నిర్లక్ష్యంతో చేసే ఒక చిన్న తప్పు ఎందరో ప్రాణాలను బలిగొంటుంది. ఆ ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్లను కూడా మృత్యువు వెంటాడుతుంది.

ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉండే ఈ కాన్సెప్టుతో సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ ఫ్రాంచైజీ గా పేరు తెచ్చుకుంది ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటికీ ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని మంచి సక్సెస్ సాధించాయి. రీసెంట్‌గా గత నెలలో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ నుంచి ఆరో మూవీ వచ్చింది.

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2025 మే 16న వరల్డ్ వైడ్‌గా విడుదలైతే ఇండియాలో ఒకరోజు ముందే మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అది కూడా తెలుగు భాషలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2011 తర్వాత సుమారు 14 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త మూవీ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

భయంకరమైన హారర్ థ్రిల్లర్ అనుభవం

ఆ అంచనాలను తగినట్లుగా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఆకట్టుకుంది. 50 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఫైనల్ డెస్టినేషన్ 6 మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 271.1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సాధించింది.

ఇలాంటి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌‌లో ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు యాపిల్ ప్లస్ టీవీలో కూడా ఫైనల్ డెస్టినేషన్ 6 ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఈ రెండింట్లో రెంటల్ విధానంలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఎక్కడ చూడాలి?

కానీ, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్, నిరాశ ఉంది. హారర్ థ్రిల్లర్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ ప్రస్తుతం ఇండియాలోని ఓటీటీల్లో అందుబాటులో లేదు. ఇతర దేశాల్లోని ప్రైమ్ వీడియో, యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ ల్లో ఫైనల్ డెస్టినేషన్ 6 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భారతదేశంలోకి మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇదిలా ఉంటే, ఫైనల్ డెస్టినేషన్ 6 సినిమాకు జాక్ లిపోవ్స్కీ, అడమ్ స్టేయిన్ దర్శకత్వం వహించారు. సుమారు గంట 49 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చిత్రంలో బ్రెక్ బసింగర్, విలియమ్ బ్లడ్‌వర్త్, రిచర్డ్ హార్మోన్, క్యాథలీన్ శాంటా జువానా, టియో బ్రియోన్స్, ఓవెన్ జాయ్‌నర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులు ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే భయంకరమైన అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. త్వరలోనే భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.