
రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు సంబంధించి తాజా సమాచారం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మోనికా ఐ లవ్ యూ’ పాట జూలై 11న విడుదల కానుంది. ఈ పాట ప్రోమో ఇప్పటికే విడుదలైంది.
Key Points
రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తుంది.
‘మోనికా ఐ లవ్ యూ’ అనే పాట జూలై 11న విడుదల అవుతుంది.
ఫుల్ మాస్ బీట్‌తో ఉండే ఈ పాట ప్రోమో ఇప్పటికే విడుదలైంది.
ఆగస్టు 14న ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
‘కూలీ’ సినిమా నుంచి తాజా అప్డేట్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’(Coolie). లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde)స్టెప్పులేయనుంది. ఐటెం సాంగ్ చేసి బాక్సాఫీసుli బద్దలు కొట్టబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను పెంచేశాయి.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో అప్పుడే చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘కూలీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ మోనికా రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. మోనికా ఐలవ్ యూ అనే సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. మొత్తం పాట జూలై 11న రానున్నట్లు వెల్లడించారు. రిలీజ్ అయిన సాంగ్ ఫుల్ మాస్ బీట్‌తో ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
‘మోనికా ఐ లవ్ యూ’ సాంగ్ రిలీజ్ డేట్
సినిమా విడుదల తేదీ
‘కూలీ’ సినిమా నుంచి విడుదలవుతున్న వరుస అప్డేట్లు అభిమానులను ఉత్సాహంగా నింపుతున్నాయి. జూలై 11న విడుదలయ్యే పాటతో పాటు ఆగస్టు 14న సినిమా విడుదలకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.


