|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తో సూపర్ స్టార్ మనవడు.. ఇట్స్ అఫీషియల్

Published: 09-11-2025, 3:26 AM
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తో సూపర్ స్టార్ మనవడు.. ఇట్స్ అఫీషియల్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు గట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ అఫీషియల్ ప్రకటనతో గట్టమనేని ఫ్యామిలీ నుండి మరో నటుడు పరిచయం అవుతున్నాడు.

Key Points

1

సూపర్ స్టార్ కృష్ణ మనవడు గట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం.

2

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం.

4

ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

గట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ

దిశ‌, వెబ్ డెస్క్: సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరొక‌రు న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. కృష్ణ మ‌న‌వ‌డు, ర‌మేష్ బాబు కుమారుడు గ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడంటూ చాలా కాలంగా ప్ర‌చారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా దానిపై అఫీషియ‌ల్ అప్డేట్ వ‌చ్చేసింది. ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌త‌కత్వం జ‌య‌కృష్ణ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. అశ్విని ద‌త్ వైజ‌యంతి మూవీస్ ఈ సినిమాను ప్రెసెంట్ చేస్తుండ‌గా చంద‌మామ క‌థ‌లు బ్యాన‌ర్ పై పి. కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

కృష్ణ‌తో అశ్విని ద‌త్ అగ్నిప‌ర్వతం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తెరెక్కించారు. అంతే కాకుండా మ‌హేశ్ బాబును ఆయ‌నే ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. ఇప్పుడు జ‌య‌కృష్ణ కూడా అదే బ్యాన‌ర్ తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా చిత్ర‌యూనిట్ సినిమా అనౌన్సింగ్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో తిరుమ‌ల ఆల‌యం కొండ‌లు క‌నిపిస్తున్నాయి. ఈ నెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

దర్శకుడు, నిర్మాణ సంస్థ వివరాలు

త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్

ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, గట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.