
📌 Key Points
- సూపర్ స్టార్ కృష్ణ నిర్ణయంతో మహేష్ బాబు కెరీర్ ప్రమాదం నుండి తప్పించుకుంది!
- బావ నచ్చాడు మూవీలో నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్ నటించారు.
- కీరవాణి సంగీతం అందించినప్పటికీ, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
- కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మొదట మహేష్ బాబుతో సినిమా ప్లాన్, ఆపై నాగార్జునతో తెరకెక్కించారు.
మహేష్ బాబు కెరీర్ లో ఊహించని సంఘటన! సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమాను ఆపడం వెనుక అసలు కారణం ఏంటి? ఆ సినిమా నాగార్జునతో ఎలా తెరకెక్కిందో తెలుసుకోవడానికి చదవండి!
కృష్ణ అడ్డుకున్న సినిమా ఏంటి?
మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో రాజకుమారుడు మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నటించిన యువరాజు చిత్రం డిజాస్టర్ అయింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీనితో మహేష్ బాబు కెరీర్ పై సూపర్ స్టార్ కృష్ణ ఆలోచనలో పడ్డారు.
ఆ టైంలో రోజా మూవీస్ బ్యానర్ లో తమిళ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఖరారైంది. అప్పట్లో పత్రికా ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇక సినిమా ప్రారంభోత్సవమే మిగిలింది అనుకుంటున్న తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ అడ్డుపడ్డారు.
నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్!
ఆ సినిమా కథపై కృష్ణకి నమ్మకం కుదర్లేదు. ఆల్రెడీ యువరాజు ఫ్లాప్ అయింది. మళ్ళీ ఈ సినిమా కూడా పోతే మహెష్ కి కష్టం అవుతుంది అని కృష్ణ వద్దన్నారు. ఇంతకీ కృష్ణ వద్దన్న ఆ సినిమా ఏంటో తెలుసా.. బావ నచ్చాడు. కృష్ణ వద్దని చెప్పడం తో అదే కథని దర్శకుడు కేఎస్ రవికుమార్ అక్కినేని నాగార్జునతో చేశారు.
ఈ మూవీలో సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఇది కూడా ఒకటి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
మహేష్ బాబుకి తప్పిన ప్రమాదం!
మొత్తంగా చివరి నిమిషంలో కృష్ణ తీసుకున్న నిర్ణయం మంచిదైంది. లేకుంటే మహేష్ బాబు ఖాతాలో ఘోర పరాజయం పడేది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బావ నచ్చాడు చిత్రం తెరకెక్కింది. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే కథే అది. కానీ మరీ రొటీన్ గా ఉండడంతో ఫ్లాప్ అయింది.
చివరి నిమిషంలో కృష్ణ తీసుకున్న నిర్ణయం మహేష్ బాబు కెరీర్ కు ఎంతో మేలు చేసింది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి!


