|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భార్యపై 80 కేసులు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు! చివరకు ఏమైందంటే?

Published: 09-04-2026, 10:05 AM
భార్యపై 80 కేసులు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు! చివరకు ఏమైందంటే?
  • సుప్రీంకోర్టు ఒక వివాహ బంధానికి ముగింపు పలుకుతూ భార్యకు విడాకులు మంజూరు చేసింది.
  • భర్త న్యాయవాదిగా ఉండి 80కి పైగా కేసులు వేసి భార్యను వేధించాడని కోర్టు తెలిపింది.
  • కోర్టు భర్తను రూ.5 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశించింది.
  • భవిష్యత్తులో భార్యను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.

సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. భార్యను వేధింపులకు గురిచేసిన భర్తకు భారీ జరిమానా విధించింది. దాదాపు పదేళ్లపాటు సాగిన ఈ న్యాయపోరాటానికి తెరదించుతూ విడాకులు మంజూరు చేసింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దాదాపు దశాబ్ద కాలంగా సాగుతున్న ఒక వివాహ బంధానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని “మహాభారత యుద్ధం”తో పోల్చిన అత్యున్నత న్యాయస్థానం, భార్యకు విడాకులు మంజూరు చేస్తూనే, భర్త ఆమెకు రూ.5 కోట్ల భారీ భరణం చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఒక దంపతులకు 2010లో వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది, వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, 2016 నుంచి వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుండి ఇరుపక్షాల మధ్య చట్టపరమైన యుద్ధం మొదలైంది. భర్త వృత్తి రీత్య న్యాయవాది కావడంతో చాలా తెలివిగా భార్య, ఆమె కుటుంబంపై చాకచక్యంగా ఏకంగా 80కి పైగా కేసులు దాఖలు చేశారు. ఇందులో క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు కూడా ఉన్నాయి.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్త, తన న్యాయ పరిజ్ఞానాన్ని భార్యను వేధించడానికి ఉపయోగించారని కోర్టు అభిప్రాయపడింది. భార్య తరఫు లాయర్లపై కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఆయన తన కంపెనీ పదవులకు రాజీనామా చేసి, తక్కువ ఆదాయం ఉన్నట్లు చూపించుకున్నారని భార్య చేసిన ఆరోపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఏకకాలంలో భార్యకు రూ.5 కోట్ల భరణం చెల్లించాలని.. చెల్లించిన తర్వాతనే ఆమె ఇళ్లు ఖాళీ చేస్తుంది కోర్టు స్పష్టం చేసింది. మైనర్లయిన ఇద్దరు కుమారులను నెలకోసారి చూడ్డానికి భర్తకు కోర్టు అనుమతి ఇచ్చింది. భవిష్యత్‌లో మరోసారి భార్యను, ఆమె తరపు బంధువులను, లాయర్లను వేధిస్తూ అత్యంత కఠినంగా శిక్షిస్తామని కోర్టు హెచ్చరించింది.

భార్యపై భర్త వేధింపులు

భరణం చెల్లించాలని ఆదేశం

ఈ తీర్పు వివాహ వ్యవస్థలో మహిళల హక్కులను పరిరక్షించడంలో ఒక ముందడుగు. భార్యను వేధించేవారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుంది. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని ఈ కేసు నిరూపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.