|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూరత్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ మృతి!

Published: 31-03-2026, 7:35 AM
సూరత్‌లో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ మృతి!
  • గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
  • ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు, ఇందులో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా చీరల ప్యాకింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి.
  • భవనం ఇరుకుగా ఉండటం, పొగ కారణంగా బాధితులు తప్పించుకోలేకపోయారు.

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఒక బాలుడు సహా ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో జరిగింది.

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం

మూడంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం (Massive fire Accident) చోటు చేసుకొని చిన్నారి సహా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని సూరత్ నగరం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక మూడంతస్తుల భవనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఒక నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. ఆ కుటుంబం ఇంట్లోనే చీరల ప్యాకింగ్ పనులను నిర్వహిస్తోందని, ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

ప్యాకింగ్ కోసం ఉపయోగించే ఫోమ్ షీట్లకు మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లంతా దట్టమైన, విషపూరితమైన పొగతో నిండిపోవడంతో ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భవనం ఇరుకుగా ఉండటం, పొగ కమ్మేయడంతో ఊపిరి ఆడక వారు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఐదుగురు సజీవ దహనమయ్యారు. వీరంతా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక మంత్రి, ఎమ్మెల్యే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

సజీవదహనమైన ఐదుగురు

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ దుర్ఘటన సూరత్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.