|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Surekhavani : టాటూ వేయించుకున్న ‘సురేఖవాణి’.. ఏం టాటూ వేయించుకుందో చూశారా? వీడియో వైరల్..

Published: 12-06-2025, 12:58 PM
Surekhavani : టాటూ వేయించుకున్న ‘సురేఖవాణి’.. ఏం టాటూ వేయించుకుందో చూశారా? వీడియో వైరల్..

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి ఇటీవల తన చేతిపై టాటూ వేయించుకుని సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వేంకటేశ్వర స్వామి నామాలు, పాదాలను టాటూగా వేయించుకున్న ఆమె వీడియో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Key Points

1

సురేఖవాణి చేతిపై వేంకటేశ్వరస్వామి నామాలు, పాదాల టాటూ.

2

టాటూ వేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.

4

సురేఖవాణి కుమార్తె సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

సురేఖవాణి టాటూ వీడియో వైరల్

Surekhavani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మరింత వైరల్ అవుతుంది. అయితే ఇటీవల సినిమాలు మాత్రం తగ్గించేసింది సురేఖవాణి. తాజాగా సురేఖవాణి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

సురేఖవాణి తన కుడి చేతి మీద టాటూ వేయించుకుంది. టాటూ వేయించుకుంటుండగా ఆ నొప్పికి అరుస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన చేతిపై వేంకటేశ్వరస్వామి నామాలు, వేంకటేశ్వరస్వామి పాదాలను టాటూగా వేయించుకుంది సురేఖవాణి.

వేంకటేశ్వర స్వామి టాటూ

ఈ వీడియో షేర్ చేసి.. అతను మొదట నడిచాడు. నేను అతని స్టెప్స్ ని ఫాలో అవుతున్నాను. నా పెదబాబు.. గోవిందా గోవిందా అంటూ వెంకటేశ్వరస్వామిపై తనకున్న భక్తిని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా సురేఖవాణి టాటూ వేయించుకుంటున్న వీడియో చూసేయండి..

సుప్రీత సినిమా ఎంట్రీ

ఇక సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వైరల్ అవ్వగా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చేసింది సుప్రీత.

సురేఖవాణి వేంకటేశ్వర స్వామిపై తనకున్న భక్తిని టాటూ ద్వారా చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె మరింత ప్రజాదరణ పొందింది. ఆమె కుమార్తె సినిమా రంగంలోకి అడుగుపెట్టడం కూడా ఆసక్తికరమైన విషయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.