
📌 Key Points
- తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఎన్నికయ్యారు.
- ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
- నాగవంశీ ఉపాధ్యక్షుడిగా, అశోక్ కుమార్ కార్యదర్శిగా, రామదాసులు కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
- కొత్త కార్యవర్గం 2027 వరకు కొనసాగుతుంది; మొత్తం 1421 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఛాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించగా, నాగవంశీ ఉపాధ్యక్షుడిగా, అశోక్ కుమార్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది.
ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి(Telugu Film Chamber President)గా సురేశ్ బాబు(Suresh Babu) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్(Progressive panel) అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఈ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబుకు మద్దతు తెలిపారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి సురేశ్ బాబు సైతం గెలుపొందారు. మొత్తం 48 మంది పోటీ చేయగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 31 మంది, మన ప్యానల్ నుంచి 17 మంది ఈసీ మెబర్లుగా విజయం సాధించారు. పెద్ద ప్రొడ్యూసర్ల ప్రోగ్రెసివ్ ప్యానల్ గా.. చిన్న నిర్మాతలు మన ప్యానల్ గా ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ను, ఉపాధ్యాక్షుడిగా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా రామదాసులును ఈసీ సభ్యులు ఎన్నుకున్నారు. మరో 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కొత్త కార్యవర్గం 2027 వరకు కొనసాగుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో మొత్తం 3335 మంది సభ్యులున్నారు. వీరిలో 1421 మాత్రమే ఛాంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొత్త కార్యవర్గం, కీలక బాధ్యతలు
2027 వరకు కొనసాగనున్న పాలన
మొత్తం మీద, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు సినీ పరిశ్రమలో కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చాయి. సురేశ్ బాబు నాయకత్వంలో, కొత్త కార్యవర్గం 2027 వరకు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశిద్దాం. ఇది టాలీవుడ్‌కు కొత్త దిశను సూచిస్తోంది.


