
📌 Key Points
- అఖండ 2 సినిమా విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
- Eros సంస్థ కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది.
- నిర్మాత సురేష్ బాబు ఆర్థిక సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.
- బాలకృష్ణ అభిమానుల కోసం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సురేష్ బాబు హామీ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై నిర్మాత సురేష్ బాబు తాజాగా స్పందించారు. అఖండ 2 విడుదల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని, బాలయ్య ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్‌న్యూస్ అని ఆయన ప్రకటించారు.
అఖండ 2 విడుదల వాయిదాకు కారణం ఏంటి?
Suresh Babu: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా నేడు(డిసెంబర్ 5) విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈరోస్ సంస్థ అఖండ 2 సినిమాను అడ్డుకుంటూ కోర్టు నుంచి స్టే వేధించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి తమకు రావలసిన అమౌంట్ క్లియర్ చేసే వరకు అఖండ 2 సినిమాను విడుదల చేయరాదు అంటూ స్టేలో పేర్కొంది. దీంతో ఈ సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అనేకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
సురేష్ బాబు ఏమన్నారంటే?
Mirchi Madhavi: ప్రకాష్ రాజ్ తో సినిమా అన్నారు.. ఐదు మందికి కమిట్మెంట్ అడిగారు.. నేను ఎం చేశానో తెలుసా..
బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్
దీనిపై నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) స్పందించారు. తాజాగా ఆయన సైకో సిద్దార్థ అనే మూవీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అఖండ 2 సినిమా గురించి మాట్లాడుతూ..”అఖండ 2 మూవీ ఇష్యూ క్లియర్ చేయడానికి నేను కూడా వెళ్లాను. త్వరలోనే ఈ సమస్య క్లియర్ అవుతుంది. ఇవన్నీ కేవలం ఆర్థిక ఇబ్బందులు. వాటిని బయటకు చెప్పకూడదు. కానీ, ఈ విషయం గురించి ఎవరికివారు ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అభిమానులు ఇప్పుడు సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా ఇలా చాలా సినిమాలకు జరిగింది. కాబట్టి, త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అఖండ 2 సినిమా రిలీజ్ గురించి మేకర్స్ నుంచి త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
మొత్తం మీద అఖండ 2 విడుదల సమస్య తాత్కాలికమేనని సురేష్ బాబు మాటలు స్పష్టం చేస్తున్నాయి. బాలయ్య అభిమానులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


