
📌 Key Points
- సూర్య 46: సూర్య, వెంకీ అట్లూరి కాంబో సినిమాకు నెట్‌ఫ్లిక్స్ నుండి భారీ ఆఫర్!
- సినిమా విడుదల కాకముందే రూ. 85 కోట్ల ఓటీటీ డీల్ అంటే సంచలనమే!
- సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాణంలో సినిమా!
- ఈ సినిమాలో మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సూర్య 46 చిత్రం ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదల కాకముందే భారీ ధరకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.
సూర్య-వెంకీ మూవీకి రికార్డ్ ఓటీటీ డీల్!
Suriya 46: ‘సార్’ సినిమా నుంచి తన రూట్ మార్చాడు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి. అప్పటివరకు యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్స్ చేసిన ఈ వెంకీ సార్ సినిమా నుంచి కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను చేయడం స్టార్ట్ చేశాడు. ఆలా చేసిన మొదటి సినిమానే సార్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వెంకీ తెరకెక్కించిన సినిమా లక్కీ భాస్కర్.
స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ రంగంలో జరిగే గ్యాంబ్లింగ్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఇక ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తరువాత ఇప్పుడు మరోసారి తమిళ హీరోతో సినిమా చేస్తున్నాడు వెంకీ అట్లూరి. ఆ హీరో మరెవరో కాదు సూర్య(Suriya 46). చాలా కాలం క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్.. ఎన్ని కోట్లంటే?
సార్, లక్కీ భాస్కర్ లాగే ఈ సినిమా కూడా సరికొత్త కథ, కథనాలతో రానుంది అని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ను కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. అది కూడా రికార్డ్ ధరకి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.85 కోట్లు ఆఫర్ చేసిందట. అదే అమౌంట్ కు డీల్ కూడా క్లోజ్ అయ్యిందని సమాచారం. అయితే, సినిమా ఇంకా కంప్లీట్ కాకూండా, కనీసం టైటిల్ కూడా ఫిక్స్ కాకుండా ఈ రేంజ్ లో డిమాండ్ రావడం అంటే మాములు విషయం కాదు.
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న సినిమా!
కాబట్టి, సినిమాలో దమ్ము ఉంది కాబట్టే అన్ని కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమాతో వరుసగా మూడో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మమిత బైజు కీ రోల్ చేస్తోంది. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
సూర్య 46 సినిమా విడుదలకు ముందే ఓటీటీ హక్కులతో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


