|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూర్య – దిల్‌ రాజు కాంబో.. పరుశురామ్ డైరెక్షన్‌లో టాలీవుడ్ షేకింగ్ న్యూస్!

Published: 07-02-2026, 1:35 AM
సూర్య - దిల్‌ రాజు కాంబో.. పరుశురామ్ డైరెక్షన్‌లో టాలీవుడ్ షేకింగ్ న్యూస్!
  • సూర్య 46 చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, రవీనా టాండన్ కీలక పాత్రలో!
  • విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ తీసిన పరుశురామ్ దర్శకత్వంలో సూర్య!
  • దిల్ రాజు నిర్మాణంలో సూర్య – పరుశురామ్ సినిమా త్వరలో ప్రారంభం!
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై భారీగా నిర్మాణం!

కోలీవుడ్ స్టార్ సూర్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు! దిల్ రాజు నిర్మాణంలో, పరుశురామ్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రాబోతోంది. ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టించనుంది.

దిల్ రాజు నిర్మాణంలో సూర్య మూవీ?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) మనందరికీ సుపరిచితమే. ఇతను కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి(Venkey Atluri) డైరెక్ష‌న్‌లో సూర్య 46 (Suriya-46) అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్‌(Raveena Thandan) కీలక పాత్ర పోషిస్తోంది.

జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశి(Naga Vamshi), సాయి సౌజ‌న్య(Sai Soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ మూవీ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పరుశురామ్ దర్శకత్వంలో సూర్య టాలీవుడ్ ఎంట్రీ?

రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ద ఫ్యామిలీ స్టార్ సినిమాను తెరకెక్కించి పరాజయం పాలైన డైరెక్టర్ పరుశురామ్(Parasuram).. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. ద ఫ్యామిలీ స్టార్‌ని నిర్మించిన దిల్ రాజునే సూర్య – పరుశురామ్ సినిమాను కూడా నిర్మించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు సూర్య – పరుశురామ్ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతంఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

త్వరలో అధికారిక ప్రకటన!

‘యానిమల్’ సినిమా సె*క్స్ సీన్ల వల్లే హిట్ అయిందా? సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్

సూర్య మరియు దిల్ రాజు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.