
‘రానా నాయుడు’ చిత్ర నటి సుర్వీన్ చావ్లా తమిళ సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. నేషనల్ అవార్డు గ్రహీత హీరో, డైరెక్టర్లపై ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
Key Points
సుర్వీన్ చావ్లా తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో, డైరెక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేసింది.
దాదాపు 12 గంటల పాటు లుక్ టెస్ట్ పేరుతో టార్చర్ చేశారని తెలిపింది.
బ్రోకర్ ద్వారా అసభ్యకర ప్రతిపాదనలు చేశారని ఆరోపించింది.
సుర్వీన్ చావ్లా సంచలన వెల్లడి
‘రానా నాయుడు’ ఫేమ్ సుర్వీన్ చావ్లా సంచలన కామెంట్స్ చేసింది. తమిళ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తమిళ్ డైరెక్టర్, హీరో.. ఇద్దరు నేషనల్ అవార్డు ఫిల్మ్ పొందారని.. వారిద్దరు కలిసి తనను పడుకోమని బ్రోకర్‌ను సెట్ చేశారని చెప్పుకొచ్చింది. ఓ సినిమా కోసం దాదాపు 12 గంటల పాటు ఆడిషన్ చేశారని.. లుక్ టెస్ట్ అంటూ టార్చర్ చేశారని వివరించింది. దీంతో తాను చాలా అలసిపోయానని.. అక్కడి నుంచి ముంబై వెళ్లిపోయానని చెప్పింది. డైరెక్టర్‌కు హిందీ రాదని కమ్యూనికేషన్ కోసం ఒక బ్రోకర్‌ను సెట్ చేశాడని తెలిపింది.
ఇక ఆ నెక్స్ట్ డే ఆ బ్రోకర్‌తో కాల్ చేయించి దాదాపు ఐదు నిమిషాలు కాల్ మాట్లాడాక.. అసలు విషయానికి వచ్చాడని చెప్పింది. లుక్ టెస్ట్ అమేజింగ్‌గా ఉందని.. కానీ మీతో గడపాలని డైరెక్టర్ కోరుకుంటున్నట్లు చెప్పాడని.. జస్ట్ ఈ సినిమా పూర్తయ్యే వరకు కమిట్మెంట్ ఇవ్వాలని అడిగినట్లు వివరించింది. మొత్తానికి చివరికి వాళ్లతో పడుకోవాలని డైరెక్ట్‌గానే అడిగాడని.. కానీ తను నో చెప్పానని తెలిపింది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంటిమేట్ సీన్స్‌లో దారుణంగా నటించే ఈమె ఇలాంటివి చెప్పడం వింతగా అనిపిస్తుందని అంటున్నారు నెటిజన్లు.
నేషనల్ అవార్డ్ విజేతలపై ఆరోపణలు
12 గంటల లుక్ టెస్ట్ టార్చర్
సుర్వీన్ చావ్లా చేసిన ఈ ఆరోపణలు తమిళ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.


