
📌 Key Points
- సూర్య, మమితా బైజు జంటగా ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ మూవీ టీజర్ విడుదల
- టీజర్‌లో 20 ఏళ్లు చిన్న అమ్మాయితో సూర్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి.
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో జులైలో విడుదల కానున్న ‘విశ్వనాథన్ అండ్ సన్స్’.
- సూర్య సరసన రవీనా టాండన్, రాధిక ఆప్టే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సూర్య హీరోగా వస్తున్న ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ చూస్తే సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీలా ఉండబోతుందని తెలుస్తోంది.
యంగ్ హీరోయిన్‌తో సూర్య రొమాన్స్!
Every love story doesn’t start at the beginning! #VishwanathAndSons – Teaser Tamil – https://t.co/ZQbfU17sx2 Telugu – https://t.co/wMRjlRbpM2 #VenkyAtluri @gvprakash @NimishRavi @_mamithabaiju @realradikaa akka @TandonRaveena @SitharaEnts pic.twitter.com/FVnsoNul7F
— Suriya Sivakumar (@Suriya_offl) March 16, 2026
విశ్వనాథన్ అండ్ సన్స్ టీజర్ విశేషాలు
తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన సూర్యను మమితా ప్రేమిస్తుంది. కానీ సూర్యకు ఆమెపై అలాంటి ఫీలింగ్స్ ఉండవు. అయినా ఆమె వెంటపడుతుంది. `ఒక చిటికె వేస్తే ఇరవై మంది కుర్రాళ్లు నీకు క్యూ కడతారని సూర్య చెప్పగా, నాలుగు చిటికెలు వేస్తాను నువ్వు పడు అని మమితా చెప్పడం క్రేజీగా ఉంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
సూర్య సినిమా జులైలో విడుదల!
ఇందులో సూర్య చేతిలో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. అతను కొడుకు కాదు, తమ్ముడని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కథ మొత్తం ఆ పిల్లాడి చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. వ్యాపారవేత్త విశ్వనాథ్ పెద్ద కొడుకుగా సూర్య, చిన్న కొడుకుగా ఆ పిల్లాడు కనిపిస్తారని.. వారి మధ్య డ్రామానే సినిమా అని టాక్. టీజర్ ఆకట్టుకుంది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలని భావిస్తున్నారు.
‘విశ్వనాథన్ అండ్ సన్స్’ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. సూర్య మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేయనున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


