|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు, పవన్ కాదు.. మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఫేవరెట్ హీరో ఇతనే! తండ్రితో సినిమాపై ఎక్స్‌క్లూజివ్!

Published: 06-01-2026, 7:00 AM
చిరు, పవన్ కాదు.. మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఫేవరెట్ హీరో ఇతనే! తండ్రితో సినిమాపై ఎక్స్‌క్లూజివ్!
  • మెగా డాటర్ సుస్మిత కొణిదెల తన తండ్రి చిరంజీవి హీరోగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
  • ఈ చిత్రంలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు; అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
  • సుస్మిత కొణిదెల తన అభిమాన హీరో రజనీకాంత్ అని వెల్లడించారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాదని పేర్కొన్నారు.
  • ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది, U/A సర్టిఫికేట్ పొందింది.

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆమె తండ్రి చిరంజీవి హీరోగా నిర్మించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమాన హీరో ఎవరో కూడా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నిర్మాతగా సుస్మిత కొణిదెల ప్రయాణం

మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల నిర్మాతగా మారి అటు వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ మూవీస్‌తోపాటు ఇటు బిగ్‌ బడ్జెట్‌ చిత్రాలు కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు తండ్రి చిరంజీవి హీరోగా ఆమె `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని నిర్మిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్ సాహు గారపాటితో కలిసి తన గోల్డ్ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రంతో నిర్మాతగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సుస్మిత.

తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు /ఏ సర్టిఫికేట్‌ని పొందింది. డీసెంట్‌ నిడివితో మూవీ ఉంటుంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంగళవారం సినిమా గురించి నిర్మాతలు సుస్మిత కొణిదెల, మరో నిర్మాత సాహు గారపాటి ముచ్చటించారు. సినిమాపై నమ్మకాన్ని వెల్లడించారు. బుధవారం గ్రాండ్‌గా ఈవెంట్‌ ప్లాన్‌ చేశారట. సెన్సార్‌ రిపోర్ట్ పాజిటివ్‌గా ఉందని, మూవీపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చిరంజీవి కూతురు సుస్మిత మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సుస్మిత అభిమాన హీరో ఎవరు?

చిరంజీవి లుక్‌ పరంగా చాలా కేర్‌ తీసుకున్నట్టు తెలిపారు. యంగ్‌, స్టయిలీష్‌ లుక్‌ కోసం ప్రయత్నించామని చెప్పారు. అయితే ఈ మూవీకి సెపరేట్‌గా స్టయిలీస్ట్ ని పెట్టారట. అంతకు ముందు తనే అన్నీ చూసుకునేది, కానీ ఈ చిత్రానికి తను నిర్మాత కావడంతో మరో స్టయిలీస్ట్ ని పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. స్క్రిప్ట్ ల పరంగానూ డాడీ తన సలహాలు తీసుకుంటారని, అందరితోనూ డిస్కస్‌ చేస్తారని చెప్పింది. ఇందులోనూ కొన్ని తన ఇన్‌పుట్స్ ఇచ్చినట్టు తెలిపింది.

ఈ సందర్భంగా సినిమాల్లో తనకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఆసక్తికర సమాధానంగా చెప్పింది. తండ్రి పెద్ద హీరో కావడంతో కామన్‌గానే చిరంజీవి పేరు చెబుతారు. పవన్‌ పేరు చెబుతారు. బయట హీరోల్లో ఎవరు ఫేవరేట్‌ అంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పేరు చెప్పింది సుస్మిత. చిన్నప్పట్నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం, రజనీకాంత్‌ అంటే చాలా ఇష్టమని, తన ఫేవరేట్‌ హీరో అని చెప్పింది సుస్మిత.

‘మన శంకరవరప్రసాద్ గారు’ విడుదల వివరాలు

ఈ సందర్భంగా నాన్నతో సినిమా చేయడం ప్రెజర్‌ కాదు, ప్లెజర్‌ అని తెలిపింది. దేవుడు కరుణిస్తేగానీ ఈ మూవీ తనకు వచ్చిందని చెప్పింది. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు అంటే క్యూలో వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే బాబాయ్‌ని సినిమా చేయాలని అడిగినట్టు తెలిపింది. చాలా మంది ఆయనతో సినిమాలు చేయాలని పోటీ పడుతున్నారని, ఆ క్యూలో తాను కూడా ఉన్నట్టు తెలిపింది. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అని నవ్వుతూ వెల్లడించింది సుస్మిత. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

మరో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, సినిమా అన్ని అంశాల మేళవింపుగా ఉంటుందని, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్‌, యాక్షన్‌, సీరియస్‌ ఎలిమెంట్లు ఇలా అన్నీ ఉంటాయని, అయితే ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువే అని, సినిమాలో చాలా దాచి ఉంచామని, థియేటర్లో మూవీని చూసినప్పుడు సర్‌ప్రైజ్‌ అవుతారని తెలిపింది. ఫుల్‌ మీల్స్ అని చెప్పినా తక్కువే అవుతుందన్నారు. వెంకటేష్‌ రోల్‌ కూడా హిలేరియస్‌గా, రచ్చ రచ్చగా ఉంటుందని తెలిపారు. టికెట్‌ రేట్ల పెంపుకి ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలో క్లారిటీ వస్తుందని తెలిపారు.

సుస్మిత కొణిదెల నిర్మాతగా మారి, తండ్రి చిరంజీవితో నిర్మిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.