
సట్లజ్ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే OTT నుంచి తొలగించబడింది. ఖలిస్తానీ ఉగ్రవాదం నేపథ్యంలో కుక్కలను చంపేసిన క్రూర ఆదేశం వెనుక షాకింగ్ నిజాలు ఇవి!
Key Points
సట్లజ్ సినిమా OTT రిలీజ్ అయిన 48 గంటల్లోనే తొలగింపు
ఖలిస్తానీలు కుక్క మొరిగితే చంపేస్తారని ఆదేశం
జస్వంత్ సింగ్ ఖల్రా న్యాయ పోరాటం కథ
ఖలిస్తానీ ఉగ్రవాదుల క్రూరత్వం: కుక్కలపై దాడి
ఓటీటీలో రిలీజ్ అయిన 48 గంటల్లోనే ఆ చిత్రాన్ని తొలగించారు.జాతీయ భద్రతకు భారతదేశ సార్వభౌమత్వంన్ని దెబ్బతీసే సన్నివేశాలు ఆ చిత్రంలో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఆ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే సత్లజ్. ఈ చిత్రం మొత్తం 1980-1990ల కాలంలో పంజాబ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై తీశారు. నాడు గుర్తు తెలియని ఎంతో మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.ఇందుకు కారణం పంజాబ్ పోలీసుల దురాగతాలే అని తేలింది. అయితే మరణించిన సిక్కులకు న్యాయం జరగాలని సామాజిక కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా తన గళం వినిపించారు. ఆ కథే ఈ సట్లజ్.
ఖలిస్తానీ ఉగ్రవాద యుగంలో మరణించినవారిని ప్రధానంగా మూడు వర్గాల కింద విభజించారు. ఒకటి సామాన్య పౌరులు, రెండు పోలీసు సిబ్బంది, మూడు ఉగ్రవాదులు. ఆ తర్వాత సబ్ కేటగిరీల కింద ఎంతమంది హిందువులు, సిక్కులు, నామ్‌ధారీలు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు, న్యాయమూర్తులు మరణించారని లెక్కలు గట్టారు. మరణించిన వారిని వర్గాల కింద విభజించినప్పటికీ… ఈ న్యాయ పోరాటంలో ఒక మూగజీవి విస్మరించబడింది. అవే పంజాబ్‌లోని కుక్కలు.
ఖలిస్తానీ ఉగ్రవాదం పంజాబ్‌లో హద్దులు దాటుతున్న సమయంలో కేవలం మనుషులు మాత్రమే హత్యచేయబడలేదు.. మూగజీవాలైన పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కూడా బలైపోయాయి.. కాదు కాదు.. చంపేశారు. కుక్కలతో ఉగ్రవాదులకు శతృత్వం ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవ్వొచ్చు. ఖలిస్తానీ ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న పంజాబ్ గ్రామాల్లో రాత్రులు భయానకంగా గడిచేవి. ఓ వైపు ఉగ్రవాద దాడులు మరోవైపు పోలీస్ ఆపరేషన్ల మధ్య గ్రామస్తులు తమ ప్రాణఆలు అరచేతిలో పట్టుకుని కాలం వెల్లదీసేవారు. ఆ గ్రామంలో నిశబ్ధం కూడా చాలా ప్రమాదకరంగా ఉండేది. క్షణ క్షణం ఉత్కంఠను రేపే రాత్రులు.. ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయోనన్న భయం ఆ గ్రామస్తులను వెంటాడింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక కుక్క మొరగడం ప్రారంభించింది.
సట్లజ్ సినిమా OTT నుంచి తొలగింపు: కారణం ఏంటి?
ఆ కుక్క అరుపు గ్రామస్తుల్లో భయాన్ని కలిగించేంది. అదేంటి రోజు గ్రామస్తుల మధ్య తిరిగే కుక్కలే కదా.. అది మొరిగితే గ్రామస్తులు ఎందుకు భయపడేవారు అనే డౌట్ సహజంగా వస్తుంది. ఆ నిశబ్ద రాత్రి వేళల్లో కుక్క మొరిగినప్పుడు ఒక వైపు పోలీసులకు మరోవైపు ఉగ్రవాదులకు సంకేతాలు అందేవి. పోలీసులేమో అక్కడ ఉగ్రవాదులున్నారన్న అనుమానంతో సామాన్య గ్రామస్తులను అరెస్టు చేసేవారు లేదా హింసించేవారు… ఉగ్రవాదులకేమో తాము ఎక్కడున్నామో ఆ కుక్క పసిగడుతుందనే భయం వెంటాడుతుండేది. అయితే ఆ రాత్రివేళల్లో కుక్క మొరిగిందంటే చాలు.. అది తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. యముడిని ఆ కుక్కకు ఆహ్వానం అందినట్లుగానే ఉండేది.
కుక్క మొరిగినప్పుడు గ్రామస్తులు ముందుగా దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించేవారు.ఒకరు తిడతారు, ఒకరు రాళ్లు విసురుతారు మరొకరు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ కుక్క మాత్రం మొరగడం ఆపదు. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగిపోయి… ఆ కుక్క నమ్మకమైన తోడుగా కాకుండా అదొక ముప్పుగా వారికి కనిపించింది. దీంతో ఆ కుక్కలను గ్రామంలో నుంచి దూరంగా తరిమేసే ప్రయత్నాలు జరిగాయి. పాపం ఆ కుక్కకు ఉగ్రవాదులు ఎవరో, పోలీసులు ఎవరో అనేది తెలియదు.తన సహజ స్వభావం ప్రకారం అవి మొరుగుతుంటాయి. ఇదే విషయాన్ని ప్రముఖ పంజాబీ రచయిత వర్యమ్ సింగ్ సంధు “చౌఠీ కూత్” అనే లఘుకథలో రాశారు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు సైతం లభించింది.
ఈ లఘుకథ ఆధారంగా 2015లో గుర్విందర్ సింగ్ చౌఠీ కూత్ పేరుతోనే సినిమా తీశారు. ఇందులో ఉండే సన్నివేశాలన్నీ వాస్తవికతకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు గుర్విందర్ సింగ్. ఇది సంధు సోదరుడి కుటుంబంలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. సంధు సోదరుడింట్లో రెండు కుక్కులు ఉండేవని గుర్తుచేసుకున్నారు. ఈ రెండు కుక్కలంటే ఆ కుటుంబానికి చాలా ప్రాణం. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రెండు కుక్కలను చంపేయాల్సిందిగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ఉత్తర్వులు వచ్చాయట. కుక్కలను చంపేందుకు వారే సైనైడ్ క్యాప్సూల్స్ ఇంటి గుమ్మం ముందు ఉంచి వెళ్లారట.దీంతో భయపడిపోయిన ఆ కుటుంబం పెరుగన్నంలో సైనైడ్ క్యాప్సూల్ కలిపి తినిపించడంతో ఆ మూగజీవాలు శాశ్వతంగా మూగబోయాయి. జంతువుల ప్రాణాలకు,తమ ప్రాణాలకు మధ్య జరిగిన ఈ పోరాటంలో చివరకు ఆ మూగజీవాలే బలయ్యాయి.ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని సంధు కన్నీటిపర్యంతమయ్యాడు.
నిశబ్ద రాత్రుల్లో కుక్క మొరిగితే మృత్యువు
ఎవరి ఇంట్లో అయినా కుక్కలు ఉంటే వెంటనే వాటిని చంపాలని ఖలిస్తానీ ఉగ్రవాదులు హుకూం జారీ చేయడం జరిగింది. లేనిపక్షంలో కుక్క మూలిగినా సరే తామే కాల్చి చంపుతామని,లేదా యజమానులను హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేశారు.తమ ఉనికి ఎక్కడ బయటపడుతుందో అన్న అనుమానంతో గ్రామంలోని కుక్కలను ఖలిస్తానీలు అంతం చేయడం మొదలుపెట్టారు.వివాహ వేడుకల్లో సంగీతం,డోలు వాయిద్యాలపై నిషేధాలు విధించడమే కాకుండా,ప్రసిద్ధ జానపద గాయకుడు అమర్ సింగ్ చంకీలా దంపతులను కాల్చిచంపడం వంటి దారుణాలు నాటి పంజాబ్ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
సూర్యుడు అస్తమించగానే వీధులన్నీ శ్మశానాల్లా మారిపోయేవి.ప్రస్తుతం దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’వంటి చిత్రాలు ఆ కాలంలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన మనుషుల గురించి మాట్లాడుతున్నాయి.కానీ,చరిత్ర పొరల్లో సమాధి అయిపోయిన నాటి పెంపుడు మూగజీవాల ఆర్తనాదాలు ఎప్పటికీ ఓ తీరని గాయంగానే మిగిలిపోయాయి.
సట్లజ్ సినిమా వివాదాస్పద నిజాలతో అలరించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మాతో కనెక్ట్‌గా ఉండండి!


