
షైన్ టామ్ చాకో హీరోగా నటించిన ‘సూత్రవాక్యం’ సినిమా మలయాళంలో విడుదలై, తరువాత తెలుగులో విడుదల కానుంది. పోలీస్ స్టేషన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పడం ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. కోవిడ్ కాలంలోని ఓ కార్యక్రమం నుండి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం..
Key Points
మలయాళంలో తొలుత విడుదల, తరువాత తెలుగులో విడుదల.
పోలీస్ స్టేషన్‌లో పిల్లలకు పాఠాలు చెప్పే కథాంశం.
షైన్ టామ్ చాకో హీరోగా నటిస్తున్నారు.
కోవిడ్ సమయంలోని కౌన్సిలింగ్ కార్యక్రమాల స్ఫూర్తితో రూపొందింది.
సూత్రవాక్యం: కథానాయికలు మరియు నటీనటులు
కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్. మలయాళం నుంచి వస్తున్న తాజా హార్ట్ టచ్చింగ్ మూవీ “సూత్రవాక్యం”. దసరా విలన్ షైన్ టామ్ చాకో ( Shine Tom Chacko ) హీరోగా నటిస్తున్నాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.
“పోలీస్ స్టేషన్‌కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది… పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనకు.. కాస్త వినోదం జోడించి రూపొందినన చిత్రం “సూత్రవాక్యం”. ఇంత గొప్ప కంటెంట్ కలిగిన “సూత్రవాక్యం” చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది” అంటున్నారు “సినిమా బండి” ఫేమ్ కాండ్రేగుల లావణ్యాదేవి – కాండ్రేగుల శ్రీకాంత్!!
పోలీస్ స్టేషన్ నేపథ్యం
ఈ మూవీ మలయాళ వర్షన్ ఈనెల 11న విడుదలవుతోంది. “జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్” సంస్థ “సూత్రవాక్యం” పేరుతోనే తెలుగులో ఈ నెలాఖరున విడుదల చేయనుంది. రెజిన్ ఎస్.బాబు స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి.జాన్సన్ సంగీతం, నితిన్ కె.టి.ఆర్ ఎడిటింగ్ చేశారు. కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్‌లో… యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో “సూత్రవాక్యం” తెరకెక్కడం గమనార్హం. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో “సూత్రవాక్యం” విడుదల కానుంది.
విడుదల తేదీలు మరియు ప్రత్యేకతలు
కోవిడ్ సమయంలోని ప్రేరణతో రూపొందిన సూత్రవాక్యం, పోలీసులను భిన్న కోణంలో చూపిస్తూ, వినూత్న కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. మలయాళం తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందనుంది.


