|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సువేందు అధికారి సంచలన ఆరోపణ: పీఏ హత్య వెనుక పక్కా ప్లాన్!

Published: 07-05-2026, 12:01 AM
సువేందు అధికారి సంచలన ఆరోపణ: పీఏ హత్య వెనుక పక్కా ప్లాన్!
  • సువేందు అధికారి పీఏ చంద్రను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
  • రెండు, మూడు రోజులు రెక్కీ నిర్వహించి హత్య చేశారని సువేందు ఆరోపణ.
  • టీఎంసీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు ఇది నిదర్శనమని అధికారి వ్యాఖ్య.
  • మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హస్తం ఉందని బీజేపీ నేతల ఆరోపణ.

పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి పీఏ చంద్ర హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య పక్కా ప్లాన్‌తోనే జరిగిందని సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేశారు. టీఎంసీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ దుమారానికి తెరలేపారు.

హత్య వెనుక పక్కా ప్లాన్: అధికారి ఆరోపణలు

పశ్చిమ బెంగాల్ ‌బీజేపీ నాయకుడు సువేందు అధికారి పీఏ చంద్రను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం సాయంత్రం ఈ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మధ్యగ్రామ్ సమీపంలో హత్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే, ఈ సంఘ‌ట‌న‌పై తాజాగా షాకింగ్ ఆరోప‌ణ‌లు చేశారు సువేందు అధికారి. పక్కా ప్లాన్‌తోనే నా పీఏను చంపారని సీరియ‌స్ అయ్యారు. రెండు నుంచి మూడు రోజులు రెక్కీ నిర్వహించి, నిందితులు ఈ హత్య చేసినట్లు డీజీపీ తనకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇది టీఎంసీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు నిదర్శనమని పడ్డారు. త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తామని కూడా ప్రకటన చేశారు సువేందు అధికారి. కాగా పీఏ చంద్ర హత్య వెనక మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో లేకున్నా తమ‌దే రాజ్యమని చెప్పేందుకు ఇలా చేశారని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారి, సీఎం రేసులో ఉన్న‌ట్లు స‌మాచారం.

టీఎంసీపై సువేందు తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం

సువేందు అధికారి చేసిన ఈ తీవ్ర ఆరోపణలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. పీఏ హత్య కేసు త్వరలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, బీజేపీ, టీఎంసీల మధ్య పోరు ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.