|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుయోధన టీజర్ విధ్వంసం! సాయికుమార్ దుర్యోధనుడిగా అరాచకం సృష్టిస్తాడా?

Published: 15-03-2026, 8:35 AM
సుయోధన టీజర్ విధ్వంసం! సాయికుమార్ దుర్యోధనుడిగా అరాచకం సృష్టిస్తాడా?
  • ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా ‘సుయోధన’ మూవీలో నటన!
  • ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై బోసుబాబు నిర్మాణంలో చిత్రం!
  • వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో మార్చి 27న విడుదల కానున్న సినిమా!
  • సాయికుమార్ దుర్యోధనుడిగా నటించడం సినిమాకి హైలైట్!

టాలీవుడ్ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్! సాయికుమార్ దుర్యోధనుడిగా నటించిన ‘సుయోధన’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దుర్యోధనుడిగా సాయికుమార్ విశ్వరూపం!

Suyodhana : ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా సాయికుమార్, ప్రేమ కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సుయోధన’. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై బోసుబాబు నిడుమోలు నిర్మాణంలో వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ సుయోధన సినిమాను మార్చ్ 27 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

మీరు కూడా సుయోధన టీజర్ చూసేయండి..

మార్చి 27న సుయోధన విడుదల సందడి!

టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. స్క్రిప్ట్ చదివాక సాయికుమార్ గారినే ఈ పాత్రకు అనుకున్నాం. స్ట్రాంగ్ సబ్జెక్ట్ తో ఈ సినిమా నిర్మించాం అని తెలిపారు. డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా అయినా నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు నిర్మాత. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథ ఇది. ప్రియదర్శి మూవీ ఓకే చేయడంతోనే నాకు స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సుయోధన క్యారెక్టర్ కి ఫస్ట్ నుంచి సాయికుమార్ గారినే అనుకున్నాను అని తెలిపారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటిస్తున్న మాకే కొత్తగా అనిపించింది. నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ కలిగింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. నేను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశాను. అది సూపర్ హిట్ అయ్యింది, గద్దర్ అవార్డ్ కూడా పొందింది. ప్రియదర్శి నాకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్ లో దర్శి లాంటి నటులతో కలిసి నేను వర్క్ చేయడం సంతోషంగా ఉంది. నేను ప్రేమ కన్నడలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో జంటగా చేసాం అని అన్నారు.

టీజర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్

ప్రియదర్శి మాట్లాడుతూ.. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. నిర్మాత బోసుబాబు గారు బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. 50 ఏళ్లుగా సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న కుటుంబం సాయి కుమార్ గారిది. ఆయన తన గొప్ప టాలెంట్ ను మాలాంటి ముందు జనరేషన్స్ కు ఇవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు.

సుయోధన టీజర్ విడుదలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయికుమార్ దుర్యోధనుడిగా ఎలా మెప్పిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.