
నిఖిల్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’ చిత్రం చివరి దశకు చేరుకుంది. పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆకర్షణీయమైన పోస్టర్‌తో పాటు, టీజర్ త్వరలోనే విడుదల కానున్నట్లు ప్రకటించారు. ‘బాహుబలి’ తరహా సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
Key Points
నిఖిల్ నటించిన 'స్వయంభు' సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది.
పీరియాడికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చివరి దశలో ఉంది.
నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్ విడుదలైంది.
'బాహుబలి' తరహా సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రం రూపొందుతోంది.
స్వయంభు టీజర్ విడుదలకు సిద్ధం
హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో తీస్తున్న చిత్రం కావడంతో చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్లు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
నిఖిల్ పుట్టినరోజు పోస్టర్ ఆవిష్కరణ
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘బాహుబలి’ తరహా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో నిఖిల్‌తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకుని కదన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.
‘కార్తికేయ 2’ మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత ‘స్పై’, ’18 పేజీస్’ చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇతడి దృష్టంతా ‘స్వయంభు’ మీదే ఉంది. దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?
‘బాహుబలి’ తరహా సినిమా
నిఖిల్ ‘స్వయంభు’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. టీజర్ విడుదల తర్వాత మరింత స్పష్టత వస్తుంది.


