
📌 Key Points
- నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ ఫిబ్రవరి 11న విడుదల!
- ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానున్న ‘స్వయంభు’ చిత్రం!
- ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నాభా నటేష్ హీరోయిన్స్!
- కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందించిన ‘స్వయంభు’!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ వచ్చేసింది. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫిబ్రవరి 11న ‘స్వయంభు’ టీజర్ రిలీజ్!
Swayambhu Teaser: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో నిఖిల్ సిద్దార్థ ఒకరు. ఈయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ మొదట్లో కొన్ని ప్లాప్ సినిమాలు చేసినా ఆ తరువాత తనకు ఎలాంటి సినిమాలైతే సెట్ అవుతాయని తెలుసుకొని తనని తాను మార్చుకొని స్టార్ హీరోగా ఎదిగాడు నిఖిల్. నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఎంత పెద్ద విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు, దాదాపు రెండేళ్ల తరువాత హీరో నిఖిల్ నుంచి వస్తున్న సినిమా స్వయంభు. పీరియాడికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రెండేళ్లకు పైగా నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. మధ్యలో కొన్ని కారణాల వాళ్ళ షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ ఎలాగోలా కంప్లీట్ చేశారు.
నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
కానీ, విడుదల విషయంలో మాత్రం ఎప్పుడు అనేది చెప్పలేదు. కానీ, ఫైనల్ గా ఆదివారం రోజున స్వయంభు టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ అవుతుందే కానీ ఎలాంటి టీజర్ విడుదల చేయలేదు. ఇప్పుడు టీజర్(Swayambhu Teaser) రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్ ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా నిఖిల్ పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. చేతిలో కత్తి పట్టుకొని ఉన్న నిఖిల్ ఫోటో సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల!
ఇక టీజర్ అప్డేట్ ఇస్తూ హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. “ఇది మా రెండేళ్ల కష్టం. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఫైనల్ గా ఈ సినిమా మీ ముందుకు రానుంది” అంటూ రాసుకొచ్చాడు. దీంతో నిఖిల్ చేసిన ఈ పోటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక స్వయంభు సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ కి రానుంది. సంయుక్త మీనన్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు.
నిఖిల్ ‘స్వయంభు’ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ అప్డేట్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


