|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sydney Sweeney: నటి స్నానమాడిన నీటితో సబ్బు.. ఇదో వింత బిజినెస్

Published: 30-05-2025, 6:34 AM
Sydney Sweeney: నటి స్నానమాడిన నీటితో సబ్బు.. ఇదో వింత బిజినెస్

ప్రముఖ హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన స్నానపు నీటితో సబ్బు తయారు చేసి అమ్ముతోంది. ఈ వార్త వినగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విచిత్రమైన వ్యాపారం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ తన స్నానపు నీటితో సబ్బు తయారు చేసింది.

2

'సిడ్నీస్ బాత్ వాటర్ బ్లిస్' పేరుతో 5000 సబ్బులు మాత్రమే అమ్ముతున్నారు.

4

జూన్ 6 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభం.

సిడ్నీ స్వీనీ యొక్క వింత వ్యాపారం

బయటకు వదిలే గ్యాస్‌ని ఒకామె కొన్నాళ్ల పాటు భద్రపరిచి అమ్ముకుందని కొన్నిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇది వినగానే చాలామంది నవ్వుకున్నారు. ఇదేం పిచ్చిపని అని మాట్లాడుకున్నారు. టిక్ టాక్‌లో వైరల్ అవ్వడం కోసం ఇలా చేశారమో అనుకున్నారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ ప్రముఖ నటి అంతకు మించి షాకయ్యే బిజినెస్ మొదలుపెట్టింది.

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ.. స్వయంగా తాను స్నానం చేసిన నీటిని భద్రపరిచి, దాంతో సబ్బు తయారు చేశానని చెప్పింది. అంతే కాకుండా వాటిని అమ్ముతానని చెప్పి అందరికీ షాకిచ్చింది. 2009 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సిడ్నీ.. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. చాలా సినిమాల్లో నగ్నంగానూ నటించింది. మన దగ్గర కూడా ఈమెకు ఓ మాదిరి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమే సబ్బు బిజినెస్.

స్నానపు నీటితో సబ్బు?

‘సిడ్నీస్ బాత్ వాటర్ బ్లిస్’ పేరిట ఓ సబ్బుని లాంచ్ చేసింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. కేవలం 5000 సబ్బులు మాత్రమే తయారు చేస్తారట. ప్రతిదాని ధర 8 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.700. అభిమానులు డిమాండ్ చేయబట్టే.. తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. జూన్ 6 నుంచి ఆన్‌లైన్ ఈ సబ్బుని విక్రయించనున్నారు.

అభిమానుల స్పందన ఎలా ఉంటుంది?

ఇలాంటి సబ్బుని కొనేవాళ్లు ఉంటారా అని మీరు అనుకోవద్దు. ఏమో సిడ్నీ స్వీనీ ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి? ప్రస్తుతానికి హాలీవుడ్‌లో మాత్రమే ఇలాంటి ఆలోచన వచ్చింది. రేప్పొద్దున మన దగ్గర కూడా ఏ బాలీవుడ్ నటో ఇలాంటి ఆఫర్ తీసుకొస్తుందేమో చూడాలి?

సిడ్నీ స్వీనీ చేసిన ఈ వింత బిజినెస్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈమె అభిమానులు ఈ సబ్బును కొంటారో లేదో చూడాలి. ఇది హాలీవుడ్‌లో మాత్రమే కాదు, ఇతర చోట్ల కూడా చర్చనీయాంశం అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.