|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మగాడితో పనేలేదు! ఒంటరిగానే హ్యాపీ అంటున్న టబు.. దుమ్ములేపే కామెంట్స్ వైరల్!

Published: 19-01-2026, 8:00 AM
షాకింగ్: మగాడితో పనేలేదు! ఒంటరిగానే హ్యాపీ అంటున్న టబు.. దుమ్ములేపే కామెంట్స్ వైరల్!
  • చిరంజీవి హీరోయిన్ టబు సంచలన వ్యాఖ్యలు: పెళ్లి, మగాడితో అవసరం లేదన్న బోల్డ్ కామెంట్స్ వైరల్!
  • నాగార్జున, విజయ్ సేతుపతి సినిమాల్లో టబు రీఎంట్రీ.. మళ్ళీ టాలీవుడ్‌లో టబు సందడి!
  • గతంలో నాగార్జున, అజయ్ దేవగన్‌తో టబు ప్రేమ వ్యవహారాలు.. రూమర్స్‌గా మిగిలిన ప్రేమ కథలు!
  • చిరంజీవితో ‘అందరివాడు’, నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాల్లో టబు సూపర్ హిట్ పెయిర్!

టాలీవుడ్ హీరోయిన్ టబు సంచలన ప్రకటన చేశారు. పెళ్లి మరియు పురుషుల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

టబు బోల్డ్ స్టేట్‌మెంట్‌తో సంచలనం

హీరోయిన్‌ టబు తెలుగులో నటించింది చాలా తక్కువ. మొత్తంగా ఒక తొమ్మిది సినిమాలు చేసింది. చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసింది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్‌ `అల వైకుంఠపురములో` చిత్రంలో మదర్‌ రోల్‌ చేసింది. అయితే తెలుగులో చాలా సెలక్టీవ్‌గా చేసింది. చాలా వరకు విజయాలు అందుకుంది. ఇప్పుడు చాలా గ్యాప్‌తో మళ్లీ టాలీవుడ్‌లో మూవీ చేయబోతుందట. నాగార్జున కొత్త సినిమాలో టబు నటిస్తుందని సమాచారం. అలాగే విజయ్‌ సేతుపతి, పూరీ జగన్నాథ్‌ కాంబోలో వస్తున్న `స్లమ్‌ డాగ్‌` చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి హీరోయిన్‌ టబుకి సంబంధించిన ఒక స్టేట్‌మెంట్‌ ఇప్పుడు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి, మగాడి అవసరానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పెళ్లి అవసరం తనకు లేదని చెప్పింది టబు. తాను ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడుతుందట.  బెడ్‌పై కలిసి పడుకోవడానికి తప్పితే, మగాడితో తనకు మరే అవసరం లేదని చెప్పింది.

టాలీవుడ్‌లో టబు రీఎంట్రీ.. ఎవరితో?

అంతేకాదు తన 52ఏళ్ల వయసులో తన స్వాతంత్య్రం విషయంలో రాజీపడలేనని గ్రహించినట్టు చెప్పింది. మనిషి పరిపూర్ణతకు వివాహం ఒక అవసరం అని తాను ఇప్పుడు భావించడం లేదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రయారిటీ ఇస్తానని చెప్పింది. `నా వృత్తిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను ఎవరూ రక్షించాల్సిన అవసరం లేని జీవితాన్ని నేను నిర్మించుకున్నాను. ఒంటరిగా ఉండటం అనేది ఒక వెయిట్‌ చేసే గది కాదు. అది నా సొంత నిర్ణయం` అని వెల్లడించింది టబు.

ప్రస్తుతం టబు కామెంట్స్ ఇంటర్నెట్‌ ని షేక్‌ చేస్తున్నాయి. ఓ హీరోయిన్‌ ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. ఇది మహిళల స్వేచ్ఛకి నిదర్శనంగా చెప్పొచ్చు. అదే సమయంలో వారి ఎదుగుదలని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. అందుకే టబు 55ఏళ్లు వచ్చినా ఒంటరిగానే ఉంది. పెళ్లికి దూరంగా ఉంది. అయితే టబు గతంలో నాగార్జునతో ప్రేమలో పడిందని, అలాగే అజయ్‌ దేవగన్‌తోనూ రిలేషన్‌ లో ఉందనే వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటికీ రూమర్లుగానే మిగిలిపోయాయి.

టబు గత ప్రేమ వ్యవహారాలు.. నిజమెంత?

టబు తెలుగులో చిరంజీవితో `అందరివాడు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నాగార్జునతో `నిన్నే పెళ్లాడతా`, `ఆవిడా మా ఆవిడే`, వెంకటేష్‌తో `కూలీ నెం 1`, బాలకృష్ణతో `చెన్నకేశవ రెడ్డి`, `పాండు రంగడు`తోపాటు `ఇది సంగతి` అనే చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. నాగ్‌కి మంచి ఫ్రెండ్‌ కూడా. పర్సనల్‌ విషయాలు కూడా ఆయనతో పంచుకుంటుంది టబు.

టబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితం గురించి, సినిమాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.