
అక్కినేని నాగార్జున 100వ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి హీరోయిన్‌గా మొదట టబు పేరు వినిపించినా, ఆమె అనారోగ్య కారణాలతో రిజెక్ట్ చేశారట. దీంతో నాగార్జున సరసన నటించేందుకు రూ.18 కోట్ల నయనతార పేరు తెరపైకి వచ్చింది.
Key Points
నాగార్జున 100వ సినిమాకు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగచైతన్య, అఖిల్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారట.
ఆరోగ్య కారణాలతో టబు హీరోయిన్ పాత్రను తిరస్కరించినట్లు ప్రచారం.
నయనతార చిరంజీవి సినిమాకు రూ.18 కోట్లు వసూలు చేస్తున్నారట.
నాగార్జున శతచిత్రానికి దర్శకుడెవరు?
దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇప్పటి అఖిల్ వరకు అందరూ స్టార్ హీరోలే. అయితే అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున త్వరలోనే 100వ సినిమా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఆర్ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇతడు తమిళ్ లో ఒక సినిమా తీశాడు. నాగార్జున తీస్తున్న ఈ మూవీ టైటిల్ కింగ్ 100 అని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట.
ఇక ఈ సినిమా హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. మొన్నటి వరకు టబు అంటూ ప్రచారం సాగగా, ఆమె రిజెక్ట్ చేశారట. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. నాగార్జున 100వ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలంటే నయనతార హీరోయిన్ గా ఉండాల్సిందేనని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని కూడా అంటున్నారు. ఇప్పటికే చిరంజీవి సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున సినిమాలో కూడా తీసుకోవాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా చిరంజీవి సినిమా కోసం దాదాపు 18 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట నయనతార. మరి అంత రేటు పెట్టి, నాగార్జున సినిమాలోకి తీసుకుంటారా ? లేదా? అనేది చూడాల్సి ఉంది.
టబు నో చెప్పడానికి కారణం అదేనా?
నయనతార కోసం రూ.18 కోట్లు పెడతారా?
మొత్తానికి, నాగార్జున శతచిత్రం కోసం హీరోయిన్ వేట ఆసక్తిగా మారింది. టబు రిజెక్ట్ చేయడంతో, నయనతారను తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. అభిమానులు మాత్రం ఆమెనే డిమాండ్ చేస్తున్నారు.

