
📌 Key Points
- తమన్నాకు బోల్డ్ సీన్స్ టార్చర్ పెట్టిన దర్శకుడు! నో చెప్పేసిన మిల్కీ బ్యూటీ!!
- డైరెక్టర్ ముందే హీరోయిన్ మార్చండి అని సీరియస్ కామెంట్స్ చేసిన డైరెక్టర్!
- తగ్గకుండా ఎదుర్కొంటానని తెగేసి చెప్పిన తమన్నా భాటియా! ఫ్యాన్స్ ఫిదా!!
- దర్శకుడు తమన్నాకు క్షమాపణ చెప్పడంతో వివాదానికి పుల్‌స్టాప్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. బోల్డ్ సీన్స్ చేయనని చెప్పడంతో దర్శకుడు ఆమెను టార్చర్ చేశాడట! దీనికి తమన్నా ఎలా స్పందించిందో తెలుసుకుందాం.
బోల్డ్ సీన్స్ కు నో చెప్పిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అయినా.. అగ్రశ్రేణి హీరోయిన్ గా ఆమె కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశం వచ్చిన అందిపుచ్చుకొని, దూసుకు వెళ్తున్నారు తమన్నా భాటియా. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఇరగదీస్తోంది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ చేస్తూ బోల్డ్ గా కూడా కనిపించింది. అయితే అలాంటి హీరోయిన్ తమన్నా భాటియా గురించి ఓ షాకింగ్ నిజం బయటపడినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
హీరోయిన్ ను మార్చమన్న డైరెక్టర్
ఓ సినిమా షూటింగ్ సమయంలో బోల్డ్ పాత్ర చేయడం తనకు నచ్చలేదని.. డైరెక్టర్ ముఖం మీదే నో చెప్పినట్లు తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారట. అయితే అప్పుడు ఆయన అందరి ముందే, హీరోయిన్ ను మార్చండి అంటూ కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడట. అంతేకాదు తనను ప్రెషర్ లోకి నెట్టినట్లు తమన్నా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
క్షమాపణ చెప్పిన దర్శకుడు
కానీ నేను తగ్గకుండా.. ఏది జరిగినా ఎదుర్కొంటానని ధైర్యంగా ముందుకు వెళ్లినట్లు స్పష్టం చేసిందట. అయితే కొన్ని రోజుల తర్వాత అదే దర్శకుడు తనకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తమన్నా భాటియా వెల్లడించిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్… తమన్నా ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. నచ్చితే చేయాలి.. లేదా ముఖం మీదే చెప్పేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా ఘటన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన తారల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.


