
తెలుగు సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరున్న తమన్నా భాటియా, తన మాజీ ప్రియుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విజయ్ వర్మ మరో నటితో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Key Points
మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మతో బ్రేకప్ గురించి స్పందించింది.
విజయ్ వర్మ మరో నటితో షికార్లు చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ అయ్యి చాలా కాలమైందని తెలిపింది.
ఈ విషయంపై తమన్నా యొక్క స్పందన బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్
సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ తమన్నా . ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . హిందీ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది . ఈ ఏడాది ఓదెల -2 మూవీతో అలరించిన భామ .. ప్రస్తుతం డూ యూ వన్నా పార్ట్ నర్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది .
వైరల్ అవుతున్న ఫోటోలు
అయితే గతంలో బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మ ప్రేమాయణం నడిపింది. అతనితో కొన్నినెలల పాటు డేటింగ్ చేసిన తమన్నా .. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది . ప్రస్తుతం వీరిద్దరు తమ సీనీ లైఫ్ లో బిజీగా ఉన్నారు . అయితే ఇటీవల తమ మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ మరో నటితో షికార్లు చేస్తూ సోషల్ మీడియాలో కనిపించారు . ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి .
తమన్నా స్పందన
తాజాగా ఈ విషయంపై మిల్కీ బ్యూటీని ప్రశ్నించగా తమన్నా రియాక్ట్ అయింది . విజయ్ వర్మతో తనకు బ్రేకప్ అయ్యి చాలా రోజులైందని తెలిపింది . అలాంటప్పుడు అతను ఎవరితో తిరిగితే నాకేంటిని కామెంట్స్ చేసింది . అతను ఎవరిని ప్రేమిస్తే తనకు ఏంటి అంటూ మాట్లాడింది . విజయ్ వర్మను ఉద్దేశించి తమన్నా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి .
చివరగా, తమన్నా తన మాజీ ప్రియుడి వ్యక్తిగత జీవితంపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


