
తాజా వెబ్ సిరీస్ ‘డు యు వన్నా పార్టనర్’ ప్రమోషన్ సందర్భంగా తమన్నా తన భవిష్యత్తు భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఎంత అదృష్టవంతుడో అని ఆమె అన్నారు.
Key Points
తమన్నా తన భవిష్యత్తు భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనను మంచి భార్యగా చూసుకునే అదృష్టవంతుడి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
“ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే నా లాంటి భార్య దక్కుతుంది” అని తమన్నా అన్నారు.
విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపై దృష్టి పెరిగింది.
తమన్నా యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ డు యు వన్నా పార్టనర్ వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓటీటీలో విడుదలయింది. ఈ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో తమన్నా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో తమన్నాతో పాటు డయానా పెంటి కూడా నటించారు. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమన్నా తన లైఫ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సాధారణంగా గ్లామర్ లైఫ్‌లో చాలా అరుదుగానే కనిపించే వ్యక్తిగత భావాలను ఈసారి తమన్నా పంచుకున్నారు. “నేను మంచి లైఫ్ పార్ట్నర్‌గా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఇదే ప్రస్తుతం నా జీవిత లక్ష్యం” అని ఆమె స్పష్టంగా చెప్పారు. సాధారణంగా తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి బయట మాట్లాడరు. కానీ ఈ ఇంటర్వ్యూలో మాత్రం తన తన వ్యక్తిగత జీవితంలో మంచి భార్యగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని.. తనకి కాబోయే భర్త కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.
‘డు యు వన్నా పార్టనర్’ ప్రమోషన్
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భార్య దొరకదు అని నాకు వచ్చే భర్త నన్ను చూసి అనుకోవాలి. అంత మంచి భార్యగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆ అదృష్టవంతుడు ఎవరైనా సరే, వారికోసం నేను కష్టపడుతున్నాను. పర్ఫెక్ట్ ప్యాకేజ్ త్వరలోనే రానుంది” అని అన్నారు.
చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో ఉన్న రిలేషన్ ముగిసిన తర్వాత, ఆమె వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల దృష్టి మరింతగా కేంద్రీకృతమైంది.
వ్యక్తిగత జీవితంపై దృష్టి
డు యు వన్నా పార్ట్నర్ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో షోలో తమన్నా, డయానా పెంటీతో కలిసి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ షో ప్రమోషన్ సందర్భంగా తమన్నా తన వ్యక్తిగత జీవితం, భావాల గురించి ఇలా బహిరంగంగా మాట్లాడడం విశేషంగా మారింది.దీనితో తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, తన జీవిత లక్ష్యం పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్‌గా మారడం అని తమన్నా స్పష్టం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమన్నా వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. కానీ ఆమె ఇంకా వివాహం చేసుకోలేదు.
తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడిన తమన్నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. మంచి భార్యగా ఉండటం తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.


