
టాలీవుడ్ నటి తమన్నా భాటియా తన స్నేహితులతో ముద్దులు, హగ్గుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ వర్మతో విడిపోయిందనే వార్తల తర్వాత ఈ పోస్ట్ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది.
Key Points
తమన్నా తన స్నేహితులతో ముద్దులు, హగ్గుల ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు విజయం ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తమన్నా విజయ్ వర్మతో విడిపోయిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తమన్నా సోషల్ మీడియా పోస్ట్
టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఎందరో అగ్ర హీరోలతో జతకట్టి.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో, వెబ్ సిరీస్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది మిల్క్ బ్యూటీ, హ్యాపీడేస్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఊసరవెల్లి, బద్రీనాథ్, రెబెల్, కెమెరామెన్ గంగతో, బాహుబలి, తడాఖా, బెంగాల్ టైగర్, సైరా నరసింహారెడ్డి, భోళా శంకర్, జైలర్, స్త్రీ-2, ఓదెల2 వంటి చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది.
అద్భుతమైన నటన, అందం, అభినయం.. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అంతేకాకుండా తమన్నా భాటియా ఐటెమ్ సాంగ్స్ కూడా మెరిసింది. ఇక సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో ఈ మిల్క్ బ్యూటీ కుర్రాళ్ల మతిపోగుడుతుందనడంలో అతిశయోక్తిలేదు. ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మత చాలా కాలంగా రిలేషన్లో ఉన్నట్లు నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్ వినిపించింది. కానీ ఇటీవల వీరిద్దరూ విడిపోయారంటూ మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి.
నెటిజన్ల కామెంట్లు
మరీ ఇవన్నీ ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. తమన్నా భాటియా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానుల్ని పలకరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘‘నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు @pragyakapoor, billymanik81. నిజమైన స్నేహాలు స్కూల్ కారిడార్లలో, కాలేజీ క్యాంటీన్లలో, లేట్ నైట్ హాస్టల్ చాట్లలో మాత్రమే జరుగుతాయని మేము అనుకుంటూ పెరిగాం. అవి ప్రత్యేకమైనవి అయినప్పటికీ, నిజం ఏమిటంటే, కొన్ని లోతైన బంధాలు ఇంకా ఏర్పడటానికి వేచి ఉన్నాం.
మీ యుక్తవయస్సులో, మీ కాన్ఫరెన్స్ గదులలో.. కొన్నిసార్లు ఇంటి పార్టీలలో.. లేదా ఫ్రైస్, తెల్లవారుజామున 2 గంటలకు మీరు వస్తారని ఊహించని హృదయపూర్వక సంభాషణలో.. మీ వ్యక్తులను కనుగొనడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. మీరు అదే నమ్మకంతో ఉండండి’’ అంటూ మిల్క్ బ్యూటీ రాసుకొచ్చింది. అలాగే తన ఫ్రెండ్స్‌తో హగ్‌లు, ముద్దుతు ఇస్తోన్న ఫొటోలు పంచుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు విజయం ఎక్కడంటూ కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ వర్మతో విరామం?
A post shared by Shanaya Kapoor (@shanayakapoor02)
తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ఈ ఫోటోలు మరియు నెటిజన్ల కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.


