
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, తమన్నా తన సన్నిహిత స్నేహితులైన కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రాషా తడానీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలతో పాటు, ఆమె తన స్నేహితులతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది.
Key Points
తమన్నా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన సన్నిహితులకు శుభాకాంక్షలు తెలిపింది.
కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రాషా తడానీతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది.
అడల్ట్ ఫ్రెండ్షిప్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది.
చాలా మంది సెలబ్రిటీలు తమన్నా పోస్ట్‌కు స్పందించారు.
తమన్నా ఫ్రెండ్షిప్ డే పోస్ట్
ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. సాధారణ వ్యక్తుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు తమ బెస్ట్ ఫ్రెండ్స్, స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం మధురమైన నోట్‌ను పంచుకుంది మిల్కీ బ్యూటి తమన్నా భాటియా.
సినీ ఇండస్ట్రీలో తన కో స్టార్స్, హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్ , మృణాల్ ఠాకూర్, యంగ్ బ్యూటి రాషా తడానీ ముగ్గురు తమన్నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఆగస్ట్ 3న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు గ్లామర్ బ్యూటి తమన్నా విషెస్ తెలియజేసింది.
అంతేకాకుండా తోటి హీరోయిన్లు అయిన మృణాల్ ఠాకూర్ , కాజల్ అగర్వాల్, రాషా తడానీతో కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కెమెరాతో మాట్లాడిన తమన్నా ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది.
గ్లామర్ హీరోయిన్లతో ఫోటోలు
” అడల్ట్ ఫ్రెండ్ షిప్స్ బెస్ట్! నేను మాట్లాడే ప్రతి స్నేహితుడి ఫోన్ కాల్ ‘ఐ లవ్ యూ’తోనే ముగుస్తుంది. మీరు అటెండ్ చేయడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పేదే ప్రతి ఫోన్ కాల్. స్కూల్, కాలేజ్‌లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారని చాలా మంది అంటారు. కానీ, అది అపోహ మాత్రమే. నిజానికి అడల్డ్ ఫ్రెండ్షిప్ బెస్ట్ అనేది నా అభిప్రాయం” అని ఆ ఇన్‌స్టా రీల్‌లో తమన్నా చెప్పుకొచ్చింది.
తమన్నా మాట్లాడిన ఈ వీడియోలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రాషా తడానీతోపాటు ఇతర స్నేహితులు దిశా అజ్వానీ, నిష్కా లుల్లా మెహ్రా, కరణ్ తోరానీ, ప్రగ్యా కపూర్, దర్శన్ ఖత్వానీలతో సన్నిహితంగా దిగిన ఫొటోలను పంచుకుంది. అలాగే, ఈ పోస్ట్‌కు వారందరిని ట్యాగ్ చేసింది తమన్నా భాటియా.
సెలబ్రిటీల స్పందన
ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన కాజల్ అగర్వాల్ ‘అవ్.. ఐ లవ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియరెస్ట్ టాము’ అని లవ్, కిస్సింగ్ ఎమోజీలతో ఓ స్వీట్ కామెంట్ పెట్టింది. ‘ఐ లవ్ యూ నువ్వు నన్ను ఏడిపించబోతున్నావు’ అంటూ రాషా తడానీ రాసుకొచ్చింది. తమన్నా పోస్ట్‌కు చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూ ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలియజేశారు.
కాగా, తమన్నా ప్రస్తుతం వీవీఎన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ చిత్రంలో నటిస్తోంది. దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్నాడు.
తమన్నా సోషల్ మీడియా పోస్ట్‌కు సెలబ్రిటీల నుండి భారీ స్పందన లభించింది. ఈ ఫోటోలు మరియు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


