|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తప్పు చేసినా అండగా ఉంటాను కానీ అబద్ధం చెబితే సహించను.. బ్రేకప్‌పై హింట్ ఇచ్చేసిన తమన్నా

Published: 01-11-2025, 5:49 AM
తప్పు చేసినా అండగా ఉంటాను కానీ అబద్ధం చెబితే సహించను.. బ్రేకప్‌పై హింట్ ఇచ్చేసిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె బ్రేకప్‌పై పరోక్షంగా హింట్ ఇచ్చింది. ప్రేమలో అబద్ధం చెబితే అస్సలు సహించనని, తప్పు చేసినా అండగా ఉంటానని తమన్నా వెల్లడించింది.

Key Points

1

నటి తమన్నా తన బ్రేకప్‌పై పరోక్షంగా హింట్ ఇచ్చింది.

2

ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధాలు చెబితే అస్సలు సహించనని తమన్నా స్పష్టం చేసింది.

4

ఈ వ్యాఖ్యలు విజయ్ వర్మతో తమన్నా బంధం ముగిసిందనే అనుమానాలకు తావిచ్చాయి.

తమన్నా పర్సనల్ లైఫ్‌లో మలుపు

గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannah Bhatia). వరుస సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్‌లోనూ చిందులేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళ అని భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ తన అందం, నటనతో మెస్మరైజ్ చేస్తోంది. ఇక తమన్నా పర్సనల్ లైఫ్‌ విషయానికొస్తే.. మిల్కీ బ్యూటీ ‘లస్ట్ స్టోరీస్-2’లో బోల్డ్ సీన్స్ చేసి రెచ్చిపోయింది. ఇక ఇందులో ఆమె రొమాన్స్ చేసిన నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో ప్రేమలో పడిపోయింది. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ జంట కాబోతున్నట్లు కూడా ప్రకటించారు.

అబద్ధంపై తమన్నా ఆగ్రహం

కానీ పెళ్లి తేదీని మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉండటంతో ఒకటయ్యేందుకు కొంత సమయం తీసుకున్నారు. వీరిద్దరు కెరీర్‌పై ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే వీరికి బ్రేకప్ అయినట్లు గత కొద్ది కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ ప్రేమ పక్షులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలా అని అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ బ్రేకప్ వార్తలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఎట్టకేలకు బ్రేకప్‌పై హింట్ ఇచ్చింది. విజయ్ వర్మ అబద్ధం చెప్పడం వల్ల దూరం అయినట్లు తన మాటల ద్వారా అర్థమవుతోంది. ‘‘ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం నాకు అస్సలు నచ్చదు. ఏదైనా తప్పు జరిగిందా? పొరపాటు జరిగిందా? లేదా సమస్య వచ్చిందా నేనే దానిని అర్థం చేసుకుని పరిష్కరించడానికి వారికి అండగా ఉంటాను. ఆ సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తా.

విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలు నిజమేనా?

ఎవరైనా తప్పు చేసినా నేను తోడుగా ఉంటా.. కానీ అబద్ధం చోబితే మాత్రం సహించలేను. అలా ఎవరైనా చేస్తే అసహ్యించుకుంటా. కొంతమంది నా ముఖం మీద అబద్ధం చెబుతారు కానీ నేను దాన్ని నమ్ముతా అని అనుకుంటారు. అదే నాకు కోపం తెప్పిస్తోంది. నన్ను తెలివి తక్కువగా భావించ నాటకాలాడుతారు. అది నాకు ఇంకా ఎక్కువ కోపాన్ని కలిగిస్తోంది. నన్ను మోసం చేయాలని చూస్తే నేను తట్టుకోలేను. అందుకే అందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా’’ అని చెప్పింది. ఇక ఈ కామెంట్స్ వైరల్ కావడంతో విజయ్ వర్మ గురించే చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తమన్నా త్వరలో ఓ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రొమాన్స్ చేయనుంది. ‘వన్-ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’టైటిల్‌తో రాబోతున్న ఈ హార్రర్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా విడుదల కాబోతుంది.

తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు విజయ్ వర్మతో ఆమె బంధంలో సమస్యలను సూచిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అబద్ధాలను సహించననే ఆమె స్పష్టమైన వైఖరి, బ్రేకప్ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంపై త్వరలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.