
తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఇంద్ర’ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళ్ళు కోల్పోయిన మాజీ పోలీస్ ఆఫీసర్ తన భార్య హంతకుడి కోసం వేటాడే కథ ఇది.
Key Points
కళ్ళు లేని మాజీ పోలీస్ ఆఫీసర్ తన భార్య హంతకుడి కోసం వేటాడుతున్న కథ.
సునీల్ విలన్ గా కీలక పాత్ర పోషించాడు.
సెప్టెంబర్ 19న సన్ నెక్స్ట్, టెంట్ కోటా ఓటీటీల్లో విడుదల.
9.4 IMDB రేటింగ్ తో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
కథానాయకుడి కష్టాలు
ఓటీటీలోకి ఓ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ దూసుకొస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి థియేటర్లో సత్తాచాటిన క్రైైమ్ థ్రిల్లర్ ‘ఇంద్ర’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇంద్ర’ మూవీ ఒకే రోజు రెండు ఓటీటీ ల్లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 19న సన్ నెక్ట్స్ తో పాటు టెంట్ కోటా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా ఆగస్టు 22, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో దుమ్మురేపింది ఈ మూవీ. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
విలన్ గా సునీల్
సబరీష్ నంద డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర మూవీలో మన టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్ కీ రోల్ ప్లే చేశాడు. ఇంద్ర సినిమాలో విలన్ షేడ్స్ లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో పాపులర్ అయిన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్. వసంత్ రవి హీరో. ఇంకా అనిక సురేంద్రన్ కూడా కీలక పాత్రలో నటించింది.
సస్పెండ్ అయిన పోలీస్, ఓ సీరియల్ కిల్లర్, హత్యకు గురైన భార్య.. ఇలా ముగ్గురు చుట్టూ ఇంద్ర మూవీ తిరుగుతుంది. ఓ అనుకోని సంఘటన కారణంగా పోలీస్ ఆఫీసర్ గా పని చేసే హీరో చూపు కోల్పోతాడు. ఆ తర్వాత అతని భార్య హత్యకు గురవుతోంది. తన భార్య చనిపోయినట్లుగానే మరికొంత మంది మహిళలు కూడా మరణిస్తారు. దీని వెనుకాల ఉన్నది సీరియల్ కిల్లర్ అనే డౌట్ వస్తుంది.
ఓటీటీ విడుదల వివరాలు
మరి ఈ హత్యలు చేస్తుంది ఎవరు? అనే యాంగిల్ లో పోలీసులు విచారిస్తారు. తన భార్యను చంపిన హంతకుడిని పట్టుకోవడం కోసం కళ్లు లేని మాజీ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. దీంతో మూవీ స్పీడ్ గా సాగిపోతుంది. మధ్యలో వచ్చే ట్విస్ట్ లు అదిరిపోతాయి. ఈ క్రమంలో విలన్ షేడ్స్ లో సునీల్ కూడా యాక్టింగ్ తో ఇరగదీస్తాడు. మరి కళ్లు లేకపోయినా భార్యను చంపిన హంతకుడిని పోలీస్ ఎలా కనిపెట్టాడన్నది ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
క్రైమ్ థ్రిల్లర్ ఇంద్ర సినిమాలో తన భార్య హంతకుడిని కనిపెట్టే క్రమంలో హీరోకు కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. తన గతంతో ఆ మర్డర్ చేసే వాడికి సంబంధం ఉందని, తన కళ్లు పోవడానికి కారణం అతడే అని హీరోకు తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
‘ఇంద్ర’ సినిమా ఓటీటీ విడుదలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కథలోని ట్విస్టులు, సస్పెన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.


