|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే రోజు నాలుగు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ థ్రిల్లర్.. చనిపోయిన వ్యక్తి దేవుడిగా.. అతని కోసం రెండు గ్రామాల వార్

Published: 09-10-2025, 11:42 PM
ఒకే రోజు నాలుగు ఓటీటీల్లోకి వచ్చిన తమిళ థ్రిల్లర్.. చనిపోయిన వ్యక్తి దేవుడిగా.. అతని కోసం రెండు గ్రామాల వార్

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ థ్రిల్లర్ ‘బాంబ్’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే రోజు నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథా నేపథ్యం, ఆసక్తికరమైన విశేషాలు ఈ కథనంలో చూడండి.

Key Points

1

తమిళ థ్రిల్లర్ 'బాంబ్' ఒకే రోజు నాలుగు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చింది.

2

అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

4

అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు.

నాలుగు ఓటీటీల్లో ‘బాంబ్’ స్ట్రీమింగ్

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి థియేటరల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన తమిళ థ్రిల్లర్ ‘బాంబ్’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ (అక్టోబర్ 10) నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రోజు నాలుగు వేర్వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చింది ఈ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు 8.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘బాంబ్’ ఓటీటీ లోకి వచ్చేసింది. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. ఒకే రోజు ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో బాంబ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ థ్రిల్లర్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

‘బాంబ్’ సినిమా కథా నేపథ్యం

బాంబ్ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 12, 2025న థియేటర్లలో రిలీజైంది. విశాల్ వెంకట్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సుధా సుకుమార్, సుకుమార్ బాలక్రిష్ణన్ నిర్మించారు. ఇప్పుడీ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది.

బాంబ్ సినిమా ను మ్యాజికల్ రియలిజమ్ జోనర్ లో ఈ మూవీని రిలీజ్ చేశారు. అంటే మ్యాజికల్ ఎలిమెంట్స్ తో కూడిన రియల్ వరల్డ్ లో జరిగే స్టోరీ ఇది. ఇందులో ఏది ఫిక్షన్, ఏది రియల్ అని కనిపెట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలో కాళీ వెంకట్ కీలక పాత్ర పోషించాడు.

మ్యాజికల్ రియలిజమ్ తో విభిన్న కథాంశం

బాంబ్ సినిమా ఓ థ్రిల్లర్. కాలపట్టి, కమ్మైపట్టి అనే రెండు గ్రామాలుగా కాలకమ్మైపట్టి ఊరు విడిపోతుంది. దేవుణ్ని నమ్మని కతిరావన్ (కాళీ వెంకట్) సడెన్ గా చనిపోతాడు. అతణ్ని రెండు గ్రామాల మధ్యలోని చెట్టు దగ్గర కుర్చీలో కూర్చోబెడతాడు. కానీ మణిముత్తు (అర్జున్ దాస్) మాత్రం తన ఫ్రెండ్ కతిరావన్ చనిపోలేదని నమ్ముతాడు.

కతిరావన్ బాడీని రెడీ చేస్తున్న సమయంలో పిత్తుల సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. దీంతో కతిరావన్ ను దేవుడు అని నమ్ముతారు. వివిధ రకాల పూజలు చేస్తారు. దేవుడు మాకంటే మాకని రెండు గ్రామాల ప్రజల కొట్లాడుతారు. సడెన్ గా కతిరావన్ కనిపించకుడా పోతాడు. ఆ తర్వాత గ్రామాల్లో గొడవలు పెద్దవిగా మారతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కతిరావన్ నిజంగానే చనిపోయాడా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మొత్తంగా, ‘బాంబ్’ చిత్రం ఒక వినూత్నమైన కథాంశంతో, మ్యాజికల్ రియలిజమ్ జానర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చనిపోయిన వ్యక్తి దేవుడిగా మారడం, దాని వల్ల రెండు గ్రామాల మధ్య జరిగే పోరు సినిమాకు హైలైట్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.