
జూన్ లో విడుదలైన తమిళ థ్రిల్లర్ ‘పెరంబం పెరుంగోబమమ్’ సినిమా రెండున్నర నెలల తర్వాత ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 8.3 ఐఎండీబీ రేటింగ్‌తో ఈ సినిమా ఆకట్టుకుంది.
Key Points
తమిళ థ్రిల్లర్ 'పెరంబం పెరుంగోబమమ్' ఓటీటీలోకి
ఐఎండీబీలో 8.3 అద్భుతమైన రేటింగ్ సాధించింది
రెండున్నర నెలల తర్వాత ఆహా తమిళంలో స్ట్రీమింగ్
కుల హింస నేపథ్యంలో రూపొందిన రివెంజ్ థ్రిల్లర్
పెరంబం పెరుంగోబమమ్ ఓటీటీ ప్రయాణం
తమిళంలో ఈ ఏడాది వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ డ్రామా థ్రిల్లర్ మూవీ పెరంబం పెరుంగోబమమ్ (peranbum perungobamum). ఈ సినిమా జూన్ లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ వారం ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయనున్న ఆహా తమిళం ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
తమిళ ఇండస్ట్రీలో వెరైటీ టైటిల్ తో వచ్చిన మూవీ ఈ పెరంబం పెరుంగోబమమ్. అంటే గొప్ప ప్రేమ గొప్ప కోపం అనే అర్థంలో వాడతారు. ఈ మూవీ జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ఆహా తమిళం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
రివెంజ్ థ్రిల్లర్ కథాంశం
“ఈ కథను అస్సలు మిస్ కావద్దు. పెరంబం పెరుంగోబమమ్ ఆగస్టు 22 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ ఉండటం విశేషం.
ఇదొక రివేంజ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. తన చిన్నతనంలో తన కుటంబాన్ని తనకు దూరం చేసిన అగ్ర కులాల వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయే ఓ నర్సు కథ ఇది. ముగ్గురు వ్యక్తులను అతడు లక్ష్యంగా చేసుకుంటాడు. కుల సంబంధిత హింసకు సంబంధించి ఓ సందేశంతో వచ్చిన మూవీ ఇది. శివప్రకాశ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అభినవ్ సుబ్రమణియన్ కథ అందించాడు.
ఐఎండీబీ రేటింగ్ మరియు ప్రేక్షకాదరణ
ఈ మూవీలో విజిత్ బచన్, షాలి నివేకస్, అరుళ్‌దాస్, మైమ్ గోపీలాంటి వాళ్లు నటించారు. పరువు హత్యల నేపథ్యంలోనే ఈ సినిమా చాలా వరకు సాగుతుంది. ఈ సినిమాకు రిలీజ్ సమయంలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అయితే ప్రేక్షకులు మాత్రం ఐఎండీబీలో సినిమాకు చాలా వరకు పాజిటివ్ రేటింగ్సే ఇచ్చారు.
దీంతో మొత్తంగా 8.3 రేటింగ్ నమోదైంది. సినిమాకు ఇళయరాజా అందించిన మ్యూజిక్ కాస్త ప్లస్ అయింది. ఈ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి ఆగస్టు 22న అడుగుపెట్టబోతోంది. మరి ఇక్కడ ప్రేక్షకులు ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.
మొత్తం మీద, పెరంబం పెరుంగోబమమ్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 8.3 ఐఎండీబీ రేటింగ్ దీనికి అదనపు ఆకర్షణ.


