
📌 Key Points
- ‘ముద్ద మందారం’ సీరియల్‌తో పాటు బిగ్‌బాస్ 9 ద్వారా తనూజ గుర్తింపు పొందింది.
- బిగ్‌బాస్ సీజన్-9 రన్నరప్‌గా తనూజ నిలవగా, కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు.
- కళ్యాణ్‌తో తన బంధం గురించి తనూజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాకింగ్ వీడియో విడుదల చేసింది.
- గొడవలున్నా తమ మధ్య ఎంతో ప్రేమ ఉండేదంటూ తనూజ చేసిన వ్యాఖ్యలు ప్రేమ వార్తలకు ఆజ్యం పోశాయి.
బుల్లితెర నటి, బిగ్‌బాస్ రన్నరప్ తనూజ, విజేత కళ్యాణ్ పడాల మధ్య బంధంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో అంతలా విసిగించే వ్యక్తి అతనొక్కడేనని, తమ గొడవల్లోనూ ఎంతో ప్రేమ ఉండేదని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
బిగ్‌బాస్ తర్వాత తనూజ ప్రస్థానం
బుల్లితెర నటి తనూజ(Tanuja) ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కన్నడ అమ్మాయి అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇక చాలా రోజుల తర్వాత బిగ్‌బాస్ సీజన్-9లో పాల్గొని మరింత పాపులారిటీ పెంచుకుంది. మొదటి నుంచి ఎక్కువ ఓట్స్ దక్కించుకుంటూ గట్టిపోటీ ఇచ్చింది. అన్ని టాస్కుల్లో బాగా అడటంతో పాటు అందరితో మంచి బాండింగ్‌ను ఏర్పరుచుకుంది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఏర్పడటంతో పాటు మా ఇంటి అమ్మాయి అనేలా చేసుకుంది. టాస్ 5 లిస్ట్‌లో నిలవడంతో అంతా ఆమెనే విన్నర్ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా.. తనూజ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్-9లో కళ్యాణ్ పడాల (Kalyan Padala)విజేతగా నిలిచాడు.
దీంతో తనూజ కొంత బాధలో ఉన్నప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ గెలవడంతో సంతోషం వ్యక్తం చేసింది. ఇంటి బయటకొచ్చిన వారంతా తమ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, తనూజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. కళ్యాణ్‌తో ఉన్న బాండింగ్‌ను ఎలాంటిదో చెప్తూ ఎమోషనల్ అయింది. ‘‘నా జీవితంలో నన్ను అంతలా విసిగించి, కోపం తెప్పించే వ్యక్తి అతనొక్కడే. మా మధ్య గొడవలు జరిగినా, అందులో ఎంతో ప్రేమ ఉండేది. తను చాలా కేరింగ్’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక హౌస్‌లో ఉన్నప్పుడు కూడా బిగ్‌బాస్ చూపించిన కొన్ని వీడియోలు వీరిద్దరి ప్రేమ వార్తలకు ఆజ్యం పోసేలా మారాయి. ఇక తనూజ కూడా ఎన్నోసార్లు కళ్యాణ్‌పై ఉన్న ప్రేమను బయటపెట్టడంతో పుకార్లు షికారు చేస్తున్నారు.
కళ్యాణ్‌తో తనూజ బంధం: ప్రేమ ఉందా?
వైరల్ అవుతున్న ప్రేమ పుకార్లు
తనూజ, కళ్యాణ్ పడాల బంధంపై చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. వారిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందా లేదా అనే విషయంపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


